కాన్సెప్టులపై పట్టుబిగిస్తే విజయం మీదే!
ఇంటర్- ప్రిపరేషన్:
ఐఐటీ- జేఈఈలో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నందున పూర్తిస్థాయి మార్కులు సంపాదించేందుకు ప్రయత్నించాలి. ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి అకాడమీ పాఠ్య పుస్తకంలో ప్రతి యూనిట్ చివర్లో ఉన్న అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను క్షుణ్నంగా సాధన చేయాలి. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ పూర్తిగా కాన్సెప్టు ఆధారంగా ఉంటాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నల విభాగంలో ఛాయిస్ ఉండదు కాబట్టి దీనిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఈ ప్రశ్నలు ఎంసెట్; జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లకు ఉపయోగపడతాయి.
ఫస్టియర్ పాఠ్యాంశాలు- వెయిటేజ్:
- మెజర్‌మెంట్స్, యూనిట్స్ అండ్ డెమైన్షన్స్- 2 మార్కులు; వెక్టార్స్- 4 మార్కులు; మోషన్ ఇన్ వన్ డైమన్షన్- 4 మార్కులు; మోషన్ ఇన్ టు డైమన్షన్- 8 మార్కులు; వర్క్-పవర్-ఎనర్జీ- 8 మార్కులు; సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్- 6 మార్కులు; గ్రావిటేషన్- 4 మార్కులు; ఆసిలేషన్స్- 8 మార్కులు; మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్- 2 మార్కులు; మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్- 4 మార్కులు; థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్- 16 మార్కులు; కెనైటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్(కేటీజీ)- 2 మార్కులు.
- అన్ని యూనిట్లకు సంబంధించిన డెరివేషన్స్, సిద్ధాంతాలను ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు ప్రక్షేపకాల పథం-పరావలయం; పని- శక్తి సిద్ధాంతం; శక్తి, ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాలు; కక్ష్య, పలాయన వేగాలు; ఇటువంటి అంశాల డెరివేషన్స్, అనువర్తనాలను చిన్న లెక్కల రూపంలో సాధించి, ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి.
- వెక్టార్స్‌లో ఉండే భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పడితే ఈ చాప్టర్‌పై పట్టు లభిస్తుంది. రొటేటరీ మోషన్‌లో.. పొజిషన్ వెక్టార్, ఫోర్స్ వెక్టార్ ముఖ్యమైనవి. అందులో సమస్యలను గుర్తించి సాధన చేయాలి.
- స్వల్ప సమాధాన ప్రశ్నలకు సంబంధించి అకాడమీ పాఠ్య పుస్తకంలోని అన్ని ప్రశ్నలను సాధించాలి. బిందు, వజ్ర లబ్ధాల లక్షణాలు; గరుకు వాలుబల్లపై వస్తువు చలనం; కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రం; ఉష్ణ గతిక శాస్త్ర ప్రథమ, ద్వితీయ నియమాలు; లఘు లోలకం, స్ప్రింగ్ లోలకాల అనువర్తనాలను సాధన చేయాలి.
సెకండియర్ ఫిజిక్స్:
సెకండియర్ విద్యార్థులు కొంత అధిక సమయాన్ని పోటీ పరీక్షలకు కూడా కేటాయించాలి కాబట్టి ఇంటర్ సిలబస్‌ను చదవడం త్వరగా పూర్తిచేయాలి.
- కొత్త సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి.
పాఠ్యాంశాలు- వెయిటేజ్:
వేవ్స్- 6 మార్కులు; ఆప్టిక్స్- 12; స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్- 10; కరెంట్ ఎలక్ట్రిసిటీ- 10; మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం- 8; ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్- 4; ఆల్టర్నేటింగ్ కరెంట్- 2; డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, రేడియేషన్, ఆటమ్స్- 8; న్యూక్లి- 6; సెమీ కండక్టర్ డివెసైస్- 6; కమ్యూనికేషన్ సిస్టమ్స్- 2; ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్- 2 మార్కులు.
- వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
- ప్రతి యూనిట్ కాన్సెప్టుపై పట్టు సాధించాలి. వెయిటేజ్ ఆధారంగా పాఠ్యాంశాలను చదవాలి.
ఎంసెట్
ఎంసెట్‌లో నెగిటివ్ మార్కులు ఉండవు. ఎంసెట్ ఫిజిక్స్‌కు సంబంధించి మూలసూత్రాలను టేబుల్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయాలి. మొదటి ఏడాది సిలబస్‌లోని ముఖ్యమైన మూలసూత్రాలైన శక్తి, ద్రవ్యవేగ, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాలపై అవగాహన పెంపొందించుకొని, వాటిని ఏ సందర్భాల్లో అనువర్తించాలో తెలుసుకోవాలి. ఉష్ణ గతిక శాస్త్రంలో ఛ్ఖీ = ఇఠిఛీఖీ అనే సూత్రం అన్ని ప్రక్రియలకు ఉపయోగపడుతుందనే విషయం తెలియాలి. అదే విధంగా సరళ హరాత్మక చలనం (ఎస్‌హెచ్‌ఎం)లో లఘు లోలక డోలనావర్తన కాలాన్ని, వాటి అనువర్తనాలను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి.
- సీనియర్ ఇంటర్ ఫిజిక్స్‌లో కిర్కాఫ్ నియమాలు; ఫ్లెమింగ్ ఎడమ, కుడిచేయి సూత్రాలు; అర్ధ వాహక పరికరాలు; ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని మూల సిద్ధాంతాలను, సమీకరణాలను పట్టిక రూపంలో పొందుపరచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇలాచేస్తే ఎంత కష్టమైన పాఠ్యాంశాన్నయినా ఇష్టంగా చదవచ్చు.
- ఏ ప్రశ్నను అధ్యయనం చేయాలన్నా తొలుత దాన్ని నిశితంగా పరిశీలించాలి. అప్పుడే అందులోని కాన్సెప్టు, దాని అనువర్తనాలను గుర్తించేందుకు వీలవుతుంది. ఎంసెట్‌లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిపై దృష్టిసారించాలి. ఫార్ములా ఆధారిత థియరీ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
- పరీక్షలో తేలికైన ప్రశ్నలను ముందుగా చేయాలి. తర్వాత క్లిష్టమైన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలవుతుంది. వీలైనన్ని ప్రీవియస్, నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
ఇంటర్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్.. ఇక మీ ఇంట్లోనే!!
- ఇంటర్ కొత్త సిలబస్ కాంప్రెహెన్సివ్ మెటీరియల్
- సబ్జెక్టులు, అధ్యాయాల వారీగా ప్రిపరేషన్ గెడైన్స్
- షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్, సమాధానాలు
- ఎంసెట్,జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్ మాక్ టెస్ట్‌లు
జేఈఈ ..
మెరుగైన ర్యాంకుకు మార్గం
జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు సిలబస్‌లోని ప్రతి అంశానికి చెందిన కాన్సెప్ట్‌లు, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, కన్జర్వేషన్ థీరమ్స్‌లను గుర్తించాలి. మూడు అంశాలకు సంబంధించి ఒకట్రెండు అనువర్తనాలతో సారాంశ పట్టికను రూపొందించుకోవాలి. ఇలా చేస్తే మొత్తం సిలబస్‌ను 40 కాన్సెప్టులు, 50 మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, 100 వరకు అనువర్తనాలకు కుదించవచ్చు. ఈ సారాంశ పట్టికను వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
జేఈఈ మెయిన్
ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, జేఈఈ మెయిన్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉంటుంది కాబట్టి కచ్చితమైన సమయపాలనతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
- ప్రిపరేషన్‌లో భాగంగా ఏదైనా ప్రశ్నను ఈ కింది 5 పాయింట్ ఫార్ములాతో సరిచూసుకుంటే ఆ ప్రశ్నను తేలిగ్గా సాధించవచ్చు. ఇది జేఈఈ మెయిన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
- ముందుగా సాధించాల్సిన ప్రశ్న జఢత్వ చట్రం (Inertial Frame) లేదా త్వరణీకృత చట్రం (Non Inertial Frame) లో ఉందో తెలుసుకోవాలి.
- ప్రతి వస్తువుకీ స్వేచ్ఛా వస్తు పటాలు (Free Body Diagrams) గీసి వాటిపై ఉండే బలాలను లెక్కించాలి.
- ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాన్ని ప్రయోగించవచ్చా లేదో చూసుకోవాలి. ఉదాహరణకు బాంబు పేలుళ్లు, తాడనాలు (Collisions), అన్ని రేడియో ధార్మికత పదార్థాల క్షీణతలు, అన్ని అణు చర్యల్లో Law of Conservation of Linear Momentumఉపయోగించాలని తెలుసుకోవాలి.
- ఇచ్చిన ప్రశ్నకు శక్తి నిత్యత్వ సూత్రాన్ని అనువర్తింపజేయవచ్చా లేదో తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రం.. ఉష్ణంలో First law of Thermodynamicsగానూ, Fluid mechanicsలో బెర్నూలీ సమీకరణంగానూ, విద్యుత్‌లో కిర్కాఫ్ రెండో నియమంగానూ, విద్యుదయస్కాంత ప్రేరణలో లెంజ్ సూత్రంగానూ కనిపిస్తుంది.
- ఉపగ్రహాలు, దృఢ వస్తువు భ్రమణంలో కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు 2013 జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్-1లో వ్యవస్థ కోణీయ వేగం కనుగొనేందుకు ఈ సూత్రాన్ని అనుసరించి ప్రశ్న ఇచ్చారు.
-
ఫ్లూయిడ్ మెకానిక్స్; వేవ్స్, ఆధునిక భౌతిక శాస్త్రంలోని యంగ్ జంట చీలికల ప్రయోగం; ఫిజికల్ ఆప్టిక్స్ వంటి చిన్న యూనిట్లపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
Ex: Two coherent point sources S1 and S2 are seperated by a small distance 'd'. The fringes obtained on the screen will be.. (JEE Mains 2013).
(ఈ ప్రశ్న సంబద్ధ కాంతి జనకాల లక్షణాలకు సంబంధించినది).- points
- straight lines
- semi-circles
- concentric circles
-
జేఈఈ మెయిన్‌లోని 30 ప్రశ్నలకు గంటలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి కాన్సెప్టులు, వాటి అనువర్తనాలను క్షుణ్నంగా నేర్చుకుని.. అధిక మోడల్ పేపర్లను సాధన చేయాలి.
పాఠ్యాంశం ప్రశ్నల సంఖ్య పాఠ్యాంశం 7 హీట్ ట్రాన్స్‌ఫర్ 1 కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ 1 మోడర్న్ ఫిజిక్స్ 5 ఆప్టిక్స్ 4 ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్ 3 ఎలక్ట్రో డైనమిక్స్ 9
ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్:
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఇచ్చే ప్రశ్నలు విభిన్నంగా ఉంటాయి. అందువల్ల బలహీనంగా ఉన్న అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించి, వాటిపై పట్టుసాధించాలి. ఘర్షణ, దృశాశాస్త్రం, భ్రమణ చలనం, ఉష్ణగతిక శాస్త్రం, ఆధునిక భౌతిక శాస్త్రం వంటి పాఠ్యాంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.-
అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. రెండో పేపర్ కొంత కఠినంగా ఉంటుంది. దీంతోపాటు నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి కాబట్టి సమాధానాలను గుర్తించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం అవసరం.
న్యూక్లి 4 ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫీల్డ్ 4 మోడర్న్ ఫిజిక్స్ 3 ఆప్టిక్స్ 4 మెకానిక్స్ 11 ఎలక్ట్రో స్టాటిక్స్ 3 ఆల్టర్నేటింగ్ కరెంట్ 2 హీట్ ట్రాన్స్‌ఫర్ 2 కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ 2 వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ 2 గ్రేవిటేషన్ 1 ఫ్లూయిడ్ మెకానిక్స్ 2 - అడ్వాన్స్‌డ్‌కు మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, మెకానిక్స్ అంశాలపై పట్టుసాధించాలి. దీనికోసం 15-20 గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. తర్వాత తప్పులను సరిచూసుకోవాలి. ఇలా చేస్తే మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు.
- ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు.
-
హెచ్.సి.వర్మ- ఫిజిక్స్.