Biology Material for Competitive Exams : ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి?
మానవ హృదయం
హృదయం అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. శరీరంలోని అన్ని భాగాల నుంచి చెడు రక్తాన్ని సేకరించి తిరిగి మంచి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేసే కండర నిర్మాణాన్ని గుండె అంటారు. గుండె పిడికిలి పరిమాణంలో, శంఖం ఆకారంలో ఉంటుంది. రేడియో ధార్మిక వికిరణాల ప్రభావం దరిచేరని అవయవం గుండె.
● వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29.
● హృదయం బరువు ప్రౌఢ పురుషుల్లో 300 గ్రాములు, స్త్రీలలో 250 గ్రాములు.
● కృత్రిమ గుండె బరువు 400 గ్రాములు.
● మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె పేరు జార్విక్–7 (1981).
● ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్΄్లాంటేషన్) చేసింది క్రిస్టియన్ బెర్నార్డ్ (దక్షిణాఫ్రికా, కేప్‌టౌన్ – 1967).
● ఇండియాలో మొదటిసారి గుండె మార్పిడి నిర్వహించింది డాక్టర్ వేణుగోపాల్ (1994 ఎయిమ్స్ – ఢిల్లీ).
● అకశేరుకాల్లో నాడీజన్య హృదయం (న్యూరోజెనిక్ హార్ట్) ఉంటుంది.
● సకశేరుకాల్లో కండర నిర్మిత హృదయం (మయోజెనిక్ హార్ట్) ఉంటుంది.
● మానవ హృదయం ఒక కండర నిర్మితం, నాడీ జనితం.
● మానవుడిలో రెండు ఊపిరితిత్తుల మధ్య ‘మీడియాస్టెనం’ అనే ఖాళీ ప్రదేశంలో గుండె ఉంటుంది.
● హృదయం ఎరుపు రంగులో ఉండటానికి కారణం మయోగ్లోబిన్ అనే వర్ణ పదార్థం. మయోగ్లోబిన్‌లో మెగ్నీషియం అయాన్లు ఉంటాయి.
● డెక్స్‌ట్రో కార్డియా అంటే గుండె కుడి రొమ్ము కింద ఉండటం.
● హృదయాన్ని ఆవరించి మూడు పొరలతో ఏర్పడిన హృదయావరణ త్వచం (పెరికార్డియం) ఉంటుంది.
● గుండె గోడలోని మూడు పొరలు వరుసగా వెలుపలి పొర.. ఎపికార్డియం, మధ్యపొర మీసోకార్డియం, చివరి/ లోపలి పొర ఎండోకార్డియం.
● హృదయావరణ త్వచం మధ్య ఉండే హృదయావరణ ద్రవం అఘాతాలు, షాక్‌ల నుంచి హృదయాన్ని రక్షిస్తుంది.
● మానవుడి హృదయంలో మొత్తం నాలుగు గదులుంటాయి. పై రెండు గదులను కర్ణికలు, కింది రెండు గదులను జఠరికలు అంటారు.
☛Follow our YouTube Channel (Click Here)
● కర్ణికలు చిన్న గదులు, జఠరికలు పెద్ద గదులు. కుడి కర్ణిక, ఎడమ జఠరిక మిగతా వాటి కంటే పెద్దవి.
● కర్ణికలు, జఠరికలను వేరు చేసేది కర్ణికాంతర జఠరికాంతర విభాజకం.
● గుండె ఎడమ భాగం అంటే ఎడమ కర్ణిక,ఎడమ జఠరికలో మంచిరక్తం (ఆమ్లజని సహిత రక్తం) ఉంటుంది.
● గుండె కుడి భాగం అంటే కుడి కర్ణిక, కుడి జఠరికలో చెడు రక్తం (ఆమ్లజని రహిత / కార్బన్ డై ఆక్సైడ్ సహిత రక్తం) ఉంటుంది.
● కర్ణికల గోడలు పలచగా ఉంటాయి. ఇవి సిరలతో సంబంధం కలిగి ఉంటాయి.
● జఠరికల గోడలు మందంగా ఉంటాయి. ఇవి ధమనులతో సంబంధం కలిగి ఉంటాయి.
● ఎక్కువ గుండెలు ఉన్న జీవి వానపాము. దీనిలో 8 జతల పార్శ్వ హృదయాలుంటాయి.
● బొద్దింకలో 13 గదులు కలిగిన గుండె ఉంటుంది.
హర్దిక వలయం (కార్డియాక్ సైకిల్)
● పిండం (భ్రూణం)లో మొదట ఏర్పడే అవయవం గుండె.
● మానవుడి గుండె పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుంచి స్పందిస్తుంది.
● కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం లేదా హర్దిక వలయం అంటారు.
హర్దిక వలయంలో 3 దశలు ఉంటాయి.
ఎ) కర్ణికలు జఠరికల విశ్రాంత స్థితి (ఊహాస్థితి)
బి) శరీర భాగాల నుంచి కర్ణికల్లోకి రక్త ప్రవాహం..
మొదటి దశ: కర్ణికల సంకోచం (సిస్టోల్) .. రక్తం జఠరికల్లోకి ప్రవహిస్తుంది.
రెండో దశ: జఠరికల సంకోచం (సిస్టోల్).. కవాటాలు మూసుకుంటాయి(లబ్). రక్తం ధమనుల్లోకి ప్రవహిస్తుంది.
మూడో దశ: జఠరికల కర్ణికల య«థాస్థితి
(డయాస్టోల్) ధమనుల్లోని కవాటాలు
మూసుకుంటాయి (డబ్).
సిస్టోల్
● గుండె కండరాలు చురుగ్గా పాల్గొనే సంకోచ క్రియను సిస్టోల్ అంటారు.
డయాస్టోల్
● గుండె కండరాలు విశ్రాంతి తీసుకునే యథా పూర్వస్థితిని డయాస్టోల్ అంటారు.
☛ Follow our Instagram Page (Click Here)
హృదయ స్పందన / గుండె కొట్టుకోవడం
● ఒక సంకోచం + ఒక సడలిక లేదా ఒక సిస్టోల్ + ఒక డయాస్టోల్ లేదా ఒక లబ్ + ఒక డబ్‌ను హృదయ స్పందనగా పేర్కొంటారు.
● హృదయ స్పందన ప్రారంభమయ్యే ప్రదేశం లయారంబకం (పేస్‌మేకర్).
● మానవుడిలో లయారంబకం SAN, A.V. Node. (Sinus Auricular Node), (Atriun Ventricle node) (సిరాకర్ణిక, కర్ణిక జఠరిక కణుపు)
● కప్పలో లయారంబకం SAN మాత్రమే. ఇది కుడికర్ణికలో ఉంటుంది.
● మానవుడిలో హృదయ సంకోచం సిరాకర్ణిక కణుపులో ప్రారంభమై SAN కర్ణిక జఠరిక కణుపునకు వ్యాపించి అక్కడి నుంచి సంకోచం చెంది బండిల్ ఆ‹ఫ్ హిజ్ ద్వారా జఠరిక కుడ్యానికి విస్తరిస్తుంది.
● ఆరోగ్యవంతమైన ప్రౌఢ వ్యక్తిలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.
● చిన్నపిల్లల్లో నిమిషానికి 130–140 సార్లు, వృద్ధుల్లో 60–70 సార్లు కొట్టుకుంటుంది.
● ఒక హృదయ స్పందనకు పట్టే కాలం – 0.8 సెకన్లు.
జంతువు | శరీర బరువు | గుండె బరువు | నిమిషానికి హృదయ స్పందనలు |
నీలి తిమింగలం | 1,50,000 కిలోలు | 750 కిలోలు | 7 |
ఏనుగు | 3,000 కిలోలు | 12–21 కిలోలు | 46 |
మానవుడు | 60–70 కిలోలు | 300 గ్రాములు | 72 |
కోయల్ టిట్ పక్షి | 8 గ్రాములు | 0.15 గ్రాములు | 1200 |
● కర్ణికల సంకోచానికి పట్టే సమయం – 0.11–0.14 సెకన్లు.
● జఠరికల సంకోచానికి పట్టే సమయం – 0.27–0.35 సెకన్లు.
● చిన్న పిల్లలు, వ్యాయామం చేసే సమయంలో, జ్వరం వచ్చిన వారిలో హృదయ స్పందన ఎక్కువగా ఉంటుంది.
● హృదయ స్పందనను వినే పరికరాన్ని స్టెతస్కోప్ (్ర΄ోనోకార్డియోగ్రాఫ్) అంటారు. దీన్ని రినె లిన్నెక్ కనుకొన్నారు.
● ధ్వని పరావర్తన సూత్రంపై ఆధారపడి స్టెతస్కోప్ పనిచేస్తుంది.
● అతిపెద్ద హృదయం (ఎక్కువ బరువు ఉన్న గుండె) తిమింగలంలో ఉటుంది.
● అతి తక్కువ హృదయ స్పందనలు చూపే గుండె నీలి తిమింగలం – 7 / నిమిషం.
● అతి చిన్న హృదయం (తక్కువ బరువు) కోయల్ టిట్ పక్షిలో ఉంటుంది.
● అతి ఎక్కువ హృదయ స్పందనలు చూపే గుండె కోయల్ టిట్ పక్షి –1200 / నిమిషం.
● క్షీరదాల్లో అతి చిన్న హృదయం ష్రూ (చుంచెలుక)లో ఉంటుంది. దీని గుండె నిమిషానికి 500 సార్లు కొట్టుకుంటుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
● టాకికార్డియా అంటే సగటుకంటే అధిక హృదయ స్పందనరేటు.
● బ్రాకికార్డియా అంటే సగటు కంటే తక్కువ హృదయ స్పందన రేటు.
● ఒకసారి హృదయ స్పందన జరిగినప్పుడు పంపు చేయడానికి కావాల్సిన రక్తం 70 మిల్లిలీటర్లు.
● ఒక నిమిషానికి మానవుడి హృదయం (4,900 మి.లీ.) దాదాపు 5 లీ. రక్తం పంపు చేస్తుంది.
● 72 స్పందనలు ణ 70 మి.లీ. రక్తం
= 5040 మి.లీ. / నిమిషం.
దాదాపు 5 లీటర్ల రక్తం.
వివిధ జీవుల్లో గుండె గదుల సంఖ్య– రక్త ప్రసరణ
జీవి | కర్ణికలు | జఠరికలు | మొత్తం గదులు | రక్త ప్రసరణ విధానం |
చేపలు | 1 | 1 | 2 | ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ(సింగిల్ సర్క్యులేషన్) |
ఉభయచరాలు | 2 | 1 | 3 | అసంపూర్ణ ద్విప్రసరణ |
సరీసృపాలు | 2 | 1బీ | 3బీ | అసంపూర్ణ ద్విప్రసరణ |
ఎ) మొసలి (సరీసృపం) |
2 | 2 | 4 | ద్వంద్వ ప్రసరణ (డబుల్ సర్క్యులేషన్) |
1. పేస్‌మేకర్ కింది వాటిలో దేనికి సంబంధించింది? (గ్రూప్–1, 2000)
1) ఊపిరితిత్తులు 2) కాలేయం
3) గుండె 4) మూత్రపిండం
2. డెక్స్‌ట్రో కార్డియా అంటే? (అసిస్టెంట్‌ఎండోమెంట్ కమిషనర్, 2009)
1) చిన్న గుండె
2) పెద్ద గుండె
3) గుండె కుడివైపు ఉండటం
4) ఎడమ వైపు ఉండటం
3. రక్తపోటును కొలిచే సాధనం? (గ్రూప్–2బి, 1984)
1) థర్మామీటర్
2) స్పిగ్నోమానోమీటర్
3) లాక్టోమీటర్
4) బారోమీటర్
☛ Join our Telegram Channel (Click Here)
4. హృదయ గరుకం (హార్ట్ మర్‌మర్) అనేది ఏ విధంగా వస్తుంది? (సివిల్స్, 2001)
1) పనిచేయలేని ఎట్రియం
2) తెరుచుకున్న కవాటాలు
3) కరోనరీ థ్రాంబోసిస్
4) చిన్న అయోర్టా
5. బ్లూ బేబీ అంటే? (ఏఎస్‌వో, 2008)
1) ఒక ఇంగ్లిష్ సినిమా పేరు
2) గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు
3) ఒక నవల
4) ఏదీకాదు
6. గుండె నొప్పికి కారణం?
(గ్రూప్–2ఎ, 1984)
1) రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డురావడం
2) గుండె కొట్టుకోవడం ఆగి΄ోవడం
3) గుండెపై మెదడు అధికారం లేక΄ోవడం
4) ఏదీకాదు
7. ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి? (ఎఫ్‌ఆర్‌వో, 2005)
1) అర సెకన్ 2) ఒక సెకన్
3) రెండు సెకన్లు 4) మూడు సెకన్లు
8. మానవ హృదయం ఒక?
(గ్రూప్–1, 1999)
1) నాడీ జనకం
2) కండర జనకం
3) కండర నిర్మితం + నాడీ జనకం
4) ఏదీకాదు
9. ప్రపంచంలో మొదట గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు?
(డిప్యూటీ ఈవో, 2008)
1) డోనాల్డ్ బెర్నార్డ్
2) వేణుగో΄ాల్
3) క్రిస్టియన్ బెర్నార్డ్
4) భాస్కర్‌రావు
10. మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు? (గ్రూప్–2ఎ, 1994)
1) 55 2) 72
3) 95 4) 120
11. కార్డియాక్ అరెస్ట్ – హృదయ స్పందన ఆగి΄ోతే ఈ కింది ప్రక్రియను ్ర΄ాథమిక చికిత్సగా గుర్తించొచ్చు? (జె.ఎల్., 2001)
1) నోటి నుంచి నోటిలోకి శ్వాసక్రియ
2) కార్డియాక్ మసాజ్
3) డాక్టర్‌ని పిలవడం
4) పైవన్నీ
సమాధానాలు
1) 3 2) 3 3) 2 4) 2 5) 2
6) 1 7) 2 8) 3 9) 3 10) 2
11) 3