Skip to main content

MHLP Recruitment : ఎంహెచ్ఎల్‌పీ భ‌ర్తీలో అవ‌క‌త‌వ‌క‌లు.. కార‌ణం ఇదేనా..?

వికారాబాద్ జిల్లాలో ఎంహెచ్ఎల్‌పీ పోస్టుల భ‌ర్తీలో అవ‌క‌త‌వ‌క‌లపై ఆరోప‌ణ‌లు చోటు చేసుకున్నాయి.
Irregularities among the recruitments of mhlp posts  Mid-level health provider recruitment selection process  Online selection list for MHLP recruitment

సాక్షి ఎడ్యుకేష‌న్: ప‌ల్లే, బ‌స్తీ దవాఖానాల్లో ప‌ని చేసే మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ అంటే.. ఎంహెచ్ఎల్‌పీల భ‌ర్తీల స‌మ‌యంలో ఒక్కో పోస్టుకు లక్షల్లో బేరసారాలు జరిగినట్టు స‌మాచారం. అయితే, జిల్లాలోని 25 పోస్టుల భర్తీకిగాను 140 మంది దరఖాస్తు చేసుకోగా, ఎంపిక జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతోపాటు సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

New RBI Governor: ఆర్‌బీఐ కొత్త గ‌వ‌ర్న‌ర్ సంజయ్ మ‌ల్హోత్రా

ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల ఎంపిక జాబితాతోపాటు తుది జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సంబంధిత అధికారులు పోస్టుల ఖాళీల వివరాలను గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ఖాళీల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్టు డీఎంహెచ్‌వో కార్యాలయం తెలుపడంతో అభ్యర్థులు వెళ్లిపోయారు.

Holiday on December 12th : డిసెంబ‌ర్ 12న ఈ రాష్ట్రంలో స్కూళ్లు, బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే..!

అయితే, భ‌ర్తీ స‌మ‌యంలో ఈ అవకతవకలు తెలిసి అధికారులు వాయిదాకు ఆదేశాలు జారీ చేశారా.. లేదా మ‌రేదైనా కార‌ణాలున్నాయా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ విష‌యాల‌పైనే ప్ర‌స్తుతం, చర్చలు జరుగుతున్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

 

Published date : 10 Dec 2024 12:42PM

Photo Stories