TGPSC Group 3 Exam: గూప్‌–3 పరీక్షకు సగం మంది దూరం.. కార‌ణం!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి న‌వంబ‌ర్‌ 17న అర్హత పరీక్షలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు ప్రశాంతంగా ముగి శాయి. మొత్తం 1,388 గ్రూప్‌–3 ఉద్యోగాలకు 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో న‌వంబ‌ర్‌ 17న ఉదయం జరిగిన పేపర్‌–1 పరీక్షకు 2,73,847 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 51.1 శాతం నమోదైంది.

చదవండి: TGPSC Group-3 2024 Paper 1 QP With Key

మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2 పరీక్షను 2,72,173 మంది రాయగా, 50.7 శాతం హాజరు నమోదైంది. ఈ గణాంకాలు ప్రాథమిక సమాచారం మాత్రమేనని, స్పష్టమై న గణాంకాలు ఒకట్రెండు రోజుల్లో తెలుస్తా యని టీజీపీఎస్సీ తెలిపింది.

చదవండి: TGPSC Group-3 2024 Paper 2 QP With Key

పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఏకంగా సగం మంది గైర్హాజరు కావడం గమనార్హం. న‌వంబ‌ర్‌ 18 ఉదయం పేపర్‌–3తో పరీక్షలు ముగియను న్నాయి. కాగా, ఈ పరీక్షకు అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని చెపుతున్నారు.

#Tags