APPSC Group 2 Jobs Additional Vacancies 2024 : గ్రూప్‌–2 అభ్య‌ర్థుల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌.. దాదాపు 1000 పోస్టుల‌కు పైగా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఇచ్చిన 899 గ్రూప్‌–2 పోస్టులకు మొత్తం 4,83,525 దరఖాస్తులు వచ్చినట్టు సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. గతనెలలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో తొలుత 897 పోస్టులను ప్రకటించగా, అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం 899 పోస్టులు ఉన్నట్లు తేలింది.

అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీప‌డుతున్నారు. దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకునేందుకు జ‌న‌వ‌రి 24వ తేదీ వరకు కమిషన్‌ ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చింది.

☛ APPSC Group-2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పోస్టుల సంఖ్య 1000కి పైగా ..
ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకుని, సరిచేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్టు తేలింది. ఆ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్‌కు జత చేయనున్నారు. ఇదే జరిగితే మొత్తం గ్రూప్‌–2 పోస్టుల సంఖ్య 1000కి పైగా చేరే అవకాశం ఉంది. ముందే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన‌ నిర్వహించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్‌–2 పోస్టుల ఎంపిక విధానం :

ఎంపిక విధానం : 

స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ :

 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ సబ్జెక్ట్‌ పేపర్‌తో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 

☛ APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

మెయిన్‌ ఎగ్జామినేషన్‌ : 

స్క్రీనింగ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1లో సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్‌–2 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.

#Tags