TSPSC Group 1 Prelims Exam Hall tickets 2024 Download : గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 హాల్ టికెట్లు విడుదల.. తేదీ ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్ : జూన్ 9వ తేదీన (ఆదివారం) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల విడుదల తేదీని TSPSC ప్రకటించింది.
ఈ పరీక్ష నిర్వహనకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రిలిమినరీ పరీక్షను TSPSC నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TSPSC తెలిపింది. www.tspsc.gov.in అధికార వెబ్‌సైట్ నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.
#Tags