TSPSC Group 1 Exam 2024 Postponed : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ వాయిదా.. వేయండి.. లేదంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) జూన్ 9వ తేదీన (ఆదివారం) నిర్వ‌హించే గ్రూప్‌-1 ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటు కొంద‌రు అభ్య‌ర్థులు కోరుతున్నారు. ఎందుకంటే.. Intelligence Bureau recruitment exam కూడా ఆదే రోజు నిర్వ‌హించ‌నున్నారు.

అలాగే TSPSC Group 1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే.. లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలోనే ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు వచ్చాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 కోసం దరఖాస్తులు చేసుకొన్న వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్‌ సర్వీసు ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.

☛ TSPSC Group 1 Prelims Exam Hall tickets 2024 Download : గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 హాల్‌ టికెట్లు విడుద‌ల‌.. తేదీ ఇదే..

ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలలో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. నిరుద్యోగులది కూడా అదే పరిస్థితి. ఎన్నికల వేళ ప్రిపేర్‌ కాలేదని.. ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే ప్రిలిమినరీ పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేసి.. తమకు న్యాయం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీలను గ్రూప్‌-1 అభ్యర్థులు కోరారు. అలాగే జూన్ 16వ తేదీ యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ ప్రిలిమ్స్ ప‌రీక్ష కూడా ఉంది. ఇలా అన్ని ప‌రీక్ష‌లు వెనువెంట‌నే ఉండ‌డంతో.. అభ్య‌ర్థులు ప్రిప‌రేష‌న్ కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు.

TGPSC Group 1 Prelims: జూన్‌ 9న టీజీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. రివిజ‌న్‌తో స‌క్సెస్ ఇలా..!

4.03 లక్షల మంది..అయితే.. గ్రూప్‌-1 అభ్య‌ర్థుల విన్న‌పంకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారమే జూన్‌ 9వ తేదీన నిర్వహిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఎట్టి ప‌రిస్థితుల్లో వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చి చెప్పింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 9వ తేదీనే పరీక్ష నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు 4.03 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

☛ TSPSC Group 1 Prelims Exam Instructions 2024 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులకు రూల్స్ ఇవే.. వీటికి అనుమ‌తి లేదు..

#Tags