TSPSC Group-1 Prelims 2023: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ముగిసిన వాద‌న‌లు.. తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ ఏ ముహూర్తాన గ్రూప్ 1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిందో..కానీ, అప్ప‌టినుంచి వివాదాలు ఒక్కొక్క‌టిగా చుట్టుముడుతున్నాయి. గ‌తేడాది ప‌క‌డ్బందీగా ప‌రీక్ష నిర్వ‌హించిన త‌ర్వాత పేప‌ర్ లీకైన స‌మాచారం ఆల‌స్యంగా వెలుగుచూసింది. దీంతో ప‌రీక్ష మొత్తాన్ని ర‌ద్దు చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ముగిసిన వాద‌న‌లు.. తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

ర‌ద్దు చేసిన త‌ర్వాత కొత్త షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈద‌ఫాలో గ‌త త‌ప్పులు పున‌రావ‌`త‌మ‌వ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిందని అధికారులు ఊపిరిపీల్చుకుంటున్న త‌రుణంలో ఇప్పుడు న్యాయ‌వివాదాలు చుట్టుముట్టాయి.

☛ TSPSC Group 2 Postponed : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. కార‌ణం ఇదే..?

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష ర‌ద్దు చేయాల‌ని కొంత‌మంది హైకోర్టును ఆశ్ర‌యించారు. పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు గురువారం పూర్తయ్యాయి. బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయనందున పరీక్ష రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

తీర్పును బ‌ట్టి టీఎస్‌పీఎస్సీ త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది.  

 ఈ ప్ర‌శ్న‌కు మీరైతే ఏం స‌మాధానం చెప్తారు.. సివిల్స్ ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌ను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి

 TSPSC Group 1 Prelims ప్ర‌శ్నాప‌త్రం కోసం క్లిక్ చేయండి

వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ (గ్రూప్‌–1) ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్‌ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్‌ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను రద్దు చేసిన విష‌యం తెలిసిందే. 

ఆ త‌ర్వాత జూన్ 11వ తేదీన మళ్లీ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెల్సిందే.

#Tags