Last Minute Tips for APPSC Group-1 Prelims 2024: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. చివరి నిమిషంలో ఇలాంటి తప్పులు చేయకండి, ఇవి ఫాలో అవ్వండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్–1 ప్రిలిమ్స్‌ పరీక్షను మార్చి 17వ తేదీన రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 92 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అవగా, ఈ ఉద్యోగాల‌కు 1,26,449 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలలో ఎగ్జామ్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ గ్రూప్‌-1 స్క్రీనింగ్ పరీక్షలు పేపర్–1 ను ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు, పేపర్–2 ను మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహించనున్నారు. గ్రూప్–1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 10వ తేదీ నుంచి  APPSC వెబ్‌సైట్ (https://psc.ap.gov.in/)వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో APPSC 2018 గ్రూప్-1, 1st ర్యాంకర్, డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ రాణి సుష్మిత అందిస్తున్న సూచనలు ఇవే..

 

  • ప్రిలిమ్స్‌ పరీక్ష దగ్గరపడుతున్నందున చివరి వారంలో చదవడానికంటే ఎక్కువగా రివిజన్‌ చేయాలి. 
  • మీరు సిద్ధం చేసుకున్న నోట్స్‌ను రివిజన్‌ చేయండి. 
  • సులభమైన ప్రశ్నలకు తొందరపడి తప్పులు చేయవద్దు. 
  • ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఎంచుకునేటప్పుడు ముందు ప్రశ్నను రెండు-మూడు సార్లు చదివి అర్ధం చేసుకోండి. 
  • గుడ్డిగా ఆన్సర్‌ పెట్టకుండా ప్రశ్న అర్థం చేసుకుంటే తప్పులు చేయకుండా ఉంటారు. 
  • ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. క్వశ్చన్‌ పేపర్‌ మీకు కఠినంగా అనిపిస్తుందంటే, మిగతా వాళ్లు కూడా అదే ఫీల్‌ అవుతున్నట్లు. మీకు మాత్రమే టఫ్‌గా వచ్చినట్లు కాదు. 
  •  ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. 
  • పాత క్వశ్చన్‌ పేపర్స్‌ చేసేటప్పుడు కఠినమైన ప్రశ్నలను తప్పకుండా ట్రై చేయండి, 
  •  పరీక్షలకు సరైన సమయంలో భోజనం చేయడం, నిద్ర పోవడం చాలా అవసరం. హెల్తీగా ఉన్నప్పుడే పరీక్షలపై ఎక్కువ సమయాన్ని కేటాయించగలం.

#Tags