The Jews : ఈ రెండు దేశాల‌ల్లోనే దాదాపు 43 శాతం యూదులు నివ‌సిస్తున్నారు..!

ఇజ్రాయెల్- తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వేలాది మంది మరణించారు.

ఇజ్రాయెల్- తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వేలాది మంది మరణించారు. ఆకస్మిక దాడి నేపధ్యంలో ఇజ్రాయెల్ ఈసారి హమాస్‌ను ఉనికిని నాశనం చేయనున్నామని ప్రకటించింది. అదే సమయంలో హమాస్ కూడా అలుపెరగని దాడి కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా హమాస్ ఇటువంటి దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ కూడా తగిన సమాధానం ఇస్తూనే వస్తోంది.

Indians Leaving Sweden: స్వీడన్‌ను వీడి స్వదేశానికి వస్తున్న భారతీయులు.. కారణాలు ఇవే..!

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసించే ఏకైక దేశం ఇజ్రాయెల్. 1948లో యూదులు తమకంటూ ప్రత్యేకంగా ఇజ్రాయెల్‌ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ముస్లిం పొరుగు దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు శత్రువులుగా మారాయి. ఇజ్రాయెల్ పలుమార్లు దాడులకు గురయ్యింది. కానీ ఈ చిన్న దేశం తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్‌ను దెబ్బతీయలేకపోతున్నారు.

Pakistan: చైనా ఆర్మీ జనరల్‌కు అత్యున్నత పురస్కారం

ఇజ్రాయెల్‌లో దాదాపు 70 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇది ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 74%. ఇక ప్రపంచంలోని మొత్తం యూదుల జనాభా విషయానికొస్తే దాదాపు ఒక కోటి 74 లక్షలు. అంటే ప్రపంచంలోని యూదు జనాభాలో 43 శాతం మంది ఇజ్రాయెల్‌లోనే నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ కాకుండా ప్రపంచంలోని ఏ దేశాలలో యూదులు నివసిస్తున్నారనే విషయానికొస్తే అమెరికాతో పాటు కెనడాలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసిస్తున్నారు. ఈ రెండు దేశాల్లో దాదాపు 43 శాతం యూదులు నివసిస్తున్నారు. మిగిలిన 24 శాతం యూదులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.

Eye Bleeding Virus: పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పే.. దీనిని నివారించడం చాలా కష్టం!!

#Tags