Part Time Teacher Jobs : గురుకుల విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో తాత్కాలిక టీచ‌ర్ ఉద్యోగాలు.. ఈ స‌బ్జెక్టుల‌కే..

పార్ట్‌ టైం (తాత్కాలిక) టీచర్‌గా విభిన్న స్థాయిల్లో ( జేఎల్‌/పీజీటీ/టీజీటీ ) పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు..

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో పార్ట్‌ టైం (తాత్కాలిక) టీచర్‌గా విభిన్న స్థాయిల్లో ( జేఎల్‌/పీజీటీ/టీజీటీ ) పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ డా.ఐ శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో కోరారు. జేల్‌ 02 (మ్యాథ్స్‌ 01, ఫిజిక్స్‌ 01 ), పీజీటీ 04 ( మ్యాథ్స్‌ 03, ఇంగ్లిషు 01 ), టీజీటీ 04 ( ఇంగ్లిషు 02, ఫిజికల్‌ సైన్స్‌ 02 ) ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్‌..

బాలికల పాఠశాలలో స్త్రీల‌కు, బాలుర పాఠశాలలో పురుషులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పీజీ, బీఎడ్‌లో కనీసం ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత, టెట్‌లో అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కో-ఆర్డినేటర్‌ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా కార్యాలయ పనివేళల్లో అందించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డీసీఓ కార్యాలయంలో డెమో నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 08518295601 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

CRPF Raising Day: నేడు సీఆర్‌పీఎఫ్‌ వ్యవస్థాపక దినోత్సవం..

#Tags