Online Applications: ప్రతిభ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

ప్రతిభ విద్యాలయాల్లో ఎనిమిదో తరగతి, ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఇంకా దరఖాస్తుల చివరి తేదీ వివరాలను వెల్లడించారు.

పాడేరు: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖ నిర్వహిస్తున్న ప్రతిభ విద్యాలయాల్లో 2024–25లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో, పధక నిర్వహణ అధికారి వి. అభిషేక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం జిల్లా మారికవలస (బాలికలు), విజయనగరం జిల్లా జోగంపేట (బాలురు) ప్రతిభ విద్యాలయాల్లో ఎనిమిదో తరగతి, ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Employment Offer: డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌ మేళా..

దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 25వరకు గడువు ఉందన్నారు. ఏప్రిల్‌ 4న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు. పాడేరు గిరిజన గురుకుల పాఠశాల (బాలికలు), పాడేరు గిరిజన గురుకుల కళాశాల (బాలికలు), అరకువేలి, చింతపల్లి గిరిజన గురుకుల పాఠశాల(బాలురు)లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

#Tags