CET 2024: సీఈటీ–2024.. ఉన్నత చదువులకు మెట్టు..

బనశంకరి: ఇంజినీరింగ్‌, అగ్రి, కొన్ని మెడికల్‌ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం ఏప్రిల్ 18న‌ నుంచి సీఈటీ–2024 ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది.

రాష్ట్ర పరీక్షా ప్రాధికార రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 737 కేంద్రాల్లో సీఈటీ పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 గంటలకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొదటిరోజు జీవశాస్త్రం, గణిత పరీక్షలు జరిగాయి. చివరిరోజైన ఏప్రిల్ 20న‌ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.

చదవండి: Free Coaching for Civils: సివిల్స్‌ సర్వీసెస్‌ కోసం ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు తేదీ..

పటిష్ట తనిఖీలు

సుమారు 3.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాచ్‌, మొబైల్‌ ఫోన్‌ తదితరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. యువతులకు మాంగల్యం మినహా ఎలాంటి ఆభరణాలు ధరించరాదని తెలిపారు.

జీన్స్‌, షూ కూడా వేసుకోరాదని ప్రకటించారు. దీంతో అభ్యర్థులను సిబ్బంది నఖశిఖ పర్యంతం క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు నిఘాపెట్టారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.

20వ తేదీన హొరనాడు, గడినాడు కన్నడిగులకు బెళగావి, మంగళూరు, బెంగళూరు కేంద్రాల్లో సీఈటీని నిర్వహిస్తారు.

#Tags