Placement Job for Student: ఇంజ‌నీరింగ్ విద్యార్థినికి ప్లేస్మెంట్లో ఉద్యోగం.... ప్యాకేజీ ఎంత‌?

ఈ కాలం విద్యార్థుల‌కు వారు త‌గిన చ‌దువుకే త‌గిన ఉద్యోగం కావాల‌ని వెలువెత్తి కూర్చుంటే, ఈ విద్యార్థిని మాత్రం ఒక ప్ర‌య‌త్నంలోనే ప్లేస్మెంట్లో త‌ను ఊహించ‌ని ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించింది. ఇలాగే మ‌రికొందరు విద్యార్థులు త‌మ తెలివి, చ‌దువుతో ఇటువంటి ఉద్యోగాల్నే పొంది గొప్ప అభినంద‌న‌ల‌ను అందుకున్నారు.
Engineering student Samhita wins placement offer

ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న ఈ విద్యార్థిని, త‌న కాలేజీలో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ ఇంటర్య్వూలో పాల్గొనింది. ఆమె త‌న పొందిన‌ విద్య, తెలివితో ఇంట‌ర్య్వూ ప‌రీక్ష‌ల్లో గెలిచి, ఎంపికై వారి కంపెనీలోనే ఏకంగా రూ. 52 లక్షల జీతంతో కూడిన‌ ఉద్యోగాన్ని సాధించింది. ఇంజనీరింగ్ విద్య కొనసాగుతుండగానే ఉద్యోగం సాధించి అదరగొట్టింది. దీంతో ఆ అమ్మాయిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Success Story: జీవితంలో మొదటిసారి ఫెయిల‌య్యా.. కానీ మ‌ళ్లీ స‌క్సెస్ కోసం మాత్రం..

ఎంత చదివినా ఉద్యోగాలు రావడం లేదు.. ఉద్యోగాలు లేవు అని కుంటి సాకులు చెప్పేవారికి ఈ అమ్మాయి సాధించిన విజయం వారికి ఆలోచ‌న మార్గం క‌లుగుతుంది. ప్రతిభ ఉంటే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. 

విద్యార్థిని గురించి.. 

సంగారెడ్డికి జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఈ అమ్మాయి పేరు పుష్పలత, విష్ణువర్ధన్‌రెడ్డి దంపతుల కుమార్తె సంహిత. ఈమె మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియాలోని బీవీఐఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది.

Civils Success Story: ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో ఫెయిల్‌... సెకండ్‌ అటెంప్ట్‌లో రెండో ర్యాంకు సాధించానిలా...

ఉద్యోగ అవ‌కాశం.

అయితే కాలేజీలో ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్య్వూలు చేపట్టింది. చాలా మంది యువ‌తి యువ‌కులు ఇటువంటి ప్లేస్మెంట్ల‌ల్లో ఉద్యోగాలు వ‌స్తే అనుకున్న ల‌క్ష్యాల‌కు చేర‌గ‌ల‌మా అని ప్ర‌శ్నించుకుంటారు. మ‌రి కొంద‌రు, ఒక ప్ర‌య‌త్నం ఉండాలి అని ఇంట‌ర్య్వూల‌లో పాల్గొంటారు. ఇలాగే పాల్గొనింది ఈ అమ్మాయి కూడా. ఆమె పాల్గొన‌గా ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఏడాదికి రూ. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక క్యాంపస్ ప్లేస్మెంట్ లో లక్కీ ఆఫర్ కొట్టేసిన సంహితను ప్లేస్‌మెంట్‌ ఇన్‌చార్జి బంగార్రాజు, ప్రిన్సిపాల్‌ సంజయ్‌దూబే, కళాశాల చైర్మన్‌ విష్ణురాజు అభినందించారు. తనకు ఈ ప్లేస్‌మెంట్‌ రావడానికి కారణం కళాశాలలో అందించిన శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని సంహిత తెలిపింది.

Inspirational Stories: ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. ఇలా ఎంద‌రికో ఉన్న‌త కొలువులు..

#Tags