Engineering Students: భాషల్లో పట్టుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు..
గూడూరు: జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకమని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం యూత్ ఎంపవర్మెంట్ మోటివేషనల్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విజయసాయిరెడ్డి ఫేస్ మాస్కులు ధరించి వినూత్నంగా ఆయనకు స్వాగతం పలికారు.
Anganwadis Bad News: అంగన్‌వాడీలకు బ్యాడ్‌న్యూస్ ఎందుకంటే...!
అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే భవిష్యత్ ఉంటుందన్నారు. అన్ని భాషల్లో పట్టుండాలని, అప్పుడే ఏ రంగంలో అయినా రాణించవచ్చని చెప్పారు. ఇంజినీరింగ్ అయిపోయిన తరువాత ఉద్యోగ రంగంలో అయినా లేదా వ్యాపార రంగంలో అయినా మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం విజయసాయిరెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ, ఏఓ రామయ్య, హెచ్‌ఓడీలు, పాల్గొన్నారు.
India’s First Constitution Park: భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ ఉద్యానవనం ప్రారంభం.. ఎక్కడంటే..!
Tags
- Engineering College
- students education
- YSRCP MP Venumbaka Vijayasai Reddy
- motivation for students
- communication skills
- job and employment opportunity
- engineering students
- Youth Empowerment Motivational Program
- chief guest vijay sai reddy
- Education News
- Sakshi Education News
- tirupati news
- MPCandidate
- VenumbakaVijayasaiReddy
- YouthEmpowerment
- MotivationalProgram
- sakshieducation updates