JEE Mains Exam: జాతీయ స్థాయిలో జేయియి మెయిన్స్ పరీక్షలు ముగిసాయి.. విద్యార్థుల సంఖ్య ఇంత!
Sakshi Education
ఇంటనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే పరీక్షలు నిన్నటితో ముగిసాయి. అయితే, పరీక్షలో హాజరైన విద్యార్థుల సంఖ్యను అధికారులు వెల్లడించారు..

ఏలూరు: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కళాశాలలు నిట్, ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడత పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు పరీక్షకు స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 182 మందికి 98 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 85 మందికి 43 మంది హాజరయ్యారు.
Jagananna Amma Vodi: అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా.. ఏటా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
ఈనెల 4 నుంచి ఇప్పటివరకు 2,918 మంది విద్యార్థులకు 2,567 మంది హాజరయ్యారు. పరీక్షలను కో–ఆర్డినేటర్ పి.సాయి కుమారి శంకర్ పర్యవేక్షించారు.
English and Digital Education: విద్యార్థులకు ఇంగ్లీష్ బోధన.. ఇకనుంచి డిజిటల్ విద్యతోపాటు..
Published date : 13 Apr 2024 02:41PM