Foundations of Modern Machine Learning: ట్రిపుల్‌ ఐటీలో టీచర్‌–సహాయక ఆన్‌లైన్‌ కోర్సు

రాయదుర్గం: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోని ఐ హబ్‌ డేటా ఆధ్వర్యంలో యూజీ ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం ‘ఫౌండేషన్స్‌ ఆఫ్‌ మోడ్రన్‌ మెషీన్‌ లర్నింగ్‌’పేరుతో టీచర్‌ సహాయక ఆన్‌లైన్‌ కోర్సును ప్రారంభించారు.
ట్రిపుల్‌ ఐటీలో టీచర్‌–సహాయక ఆన్‌లైన్‌ కోర్సు

ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కోర్సుకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కోర్సు వ్యవధి 50 వారాలు. తాజా టూల్స్, టెక్నిక్‌లను ఉపయోగించి వాస్తవ ప్రపంచ సమస్యలను విద్యార్థులు గుర్తించి, పరిష్కరించడానికి జ్ఞానం, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించుకునే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ చేపట్టారు. ట్రిపుల్‌ఐటీ ప్రొఫెసర్లు సీవీ జవహర్, అనూప్‌ ఎం. నంబూద్రి తదితరులతో కూడిన బృందం విద్యార్థులకు మార్గదర్శకం చేస్తుంది. చదవండి:

Top 10 Engineering Colleges in India : దేశంలోని టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. వీటిలో చ‌దివితే చాలు ప‌క్కా జాబ్ గ్యారెంటీ..!

NIRF: ఐటీలో పోటాపోటీ!.. బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్‌

#Tags