Srijana Tech Fest 2023: రేపటి నుంచి సృజన టెక్ ఫెస్ట్
పాలిటెక్నిక్ కోర్సు విద్యార్థుల్లోని సృజనాత్మతకను, పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సృజన టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాలేజ్ స్థాయిలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు.
కాలేజ్ స్థాయిలో ఎంపిక చేసిన ప్రాజెక్టును జిల్లాస్థాయి టెక్ ఫెస్ట్‌లో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ పి.జానకిదేవి పర్యవేక్షణాధికారిగా, డాక్టర్ కె.అశోక్, టి.సుధాకర్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు.
చదవండి: Govt Polytechnic College: ‘పాలిటెక్నిక్’కు జాతీయస్థాయి గుర్తింపు
ప్రాజెక్టుల వివరాలు ఇలా..
జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్ కోర్సుల విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు.
సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాల నుంచి గ్రీన్ బిల్డింగ్స్, నాగార్జునసాగర్ నుంచి తక్కువ ధరకు హౌసింగ్ బిల్డింగ్ మెటీరియల్స్, తిరుమలగిరి కళాశాల నుంచి మురుగునీటి శుద్ధి కర్మాగారం, నల్లగొండ కళాశాల నుంచి స్మార్ట్ పాలిటెక్నిక్ క్యాంపస్ ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో నల్లగొండ కళాశాల విద్యార్థుల రూపొందించిన కాలేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సూర్యాపేట కాలేజీ నుంచి కెరీర్ గైడెన్స్ మెరుగుపరచడం అనే ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు.