Govt Polytechnic College: ‘పాలిటెక్నిక్’కు జాతీయస్థాయి గుర్తింపు
ధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. అత్యుత్తమ సౌకర్యాలు, మెరుగైన బోధనతో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) దక్కించుకుంది. ఈ మేరకు శనివారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు వివరాలు తెలిపారు. అత్యుత్తమ బోధన, మెరుగైన సౌకర్యాలు అందించే విద్యాసంస్థలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఎన్‌బీఏ దేశ వ్యాప్తంగా కళాశాలలను, విద్యాసంస్థలను పరిశీలన చేస్తుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో న్యూఢిల్లీకి చెందిన త్రిసభ్య కమిటీ ధర్మవరం పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. కళాశాల ప్రాంగణం, తరగతి గదులు, ల్యాబ్, నియామకాలు, బడ్జెట్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమైన త్రిసభ్య కమిటీ సభ్యులు కళాశాలలో సౌకర్యాలు, బోధన వివరాలను తెలుసుకున్నారు. తాజాగా కళాశాలలోని రెండు బ్రాంచ్‌లకు (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్) మూడేళ్ల పాటు అక్రిడిటేషన్ ఇచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
జీజీహెచ్, జీఎంసీలో పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ), సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు పేర్కొన్నారు. దరఖాస్తును అనంతపురం వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 4వ తేదీలోపు దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని సూచించారు.