ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్‌ పాలమూరు

IT Jobs, Telangana, Srinivas Goud
మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సెప్టెంబ‌ర్ 24న‌ ఆయన దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో ముల్లర్‌ డాట్‌ కనెక్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో యూఎస్‌ అకౌంటింగ్‌లో శిక్షణ పొందిన 140 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పాలమూరు అంటే వలసల జిల్లాగా ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉండేదని, పంటలు పండని జిల్లాగా, తాగునీరు లేని అందని ప్రాంతంగా పేరొందిందన్నారు.

చదవండి: Engineer Jobs: ఐఐటీ ధన్‌బాద్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇప్పుడు పాలమూరును అభివృద్ధి పథంలో ఊహించని స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని, భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో జంగిల్‌ సఫారీ, బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌ను ప్రారంభిస్తామన్నారు. దివిటిపల్లిలో 400 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేశామని, ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో గట్టిగా కృషి చేస్తున్నామని, గతంలో జిల్లాను పాలించిన వారు దత్తత తీసుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.

చదవండి:  MECL Recruitment 2023: ఎంఈసీఎల్, నాగ్‌పూర్‌లో 53 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

విద్యాసంస్థలు, పరిశ్రమలతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు. అకౌంటెన్సీలో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న ముల్లర్‌ డాట్‌ కనెక్ట్‌ సంస్థ మన ఐటీ కారిడార్‌లో స్థానిక నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ముల్లర్‌ డాట్‌ కనెక్ట్‌ సంస్థ సీఎంఏ భానుప్రకాష్‌, సుశాంత్‌, సందీప్‌, శరత్‌, వైస్‌ ఎంపీపీ అనిత, దివిటిపల్లి సర్పంచ్‌ జరీనా, రైతుబంధు డైరెక్టర్‌ లక్ష్మయ్య పాల్గొన్నారు.

#Tags