Engineering Councelling: ఏపీఈఏపీసెట్ సీట్ల భ‌ర్తీకి కౌన్సెలింగ్ చివ‌రి ద‌శ‌

ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో సీట్లు ఎంపిక చేసుకునేందుకు చివ‌రి కౌన్సెలింగ్ గురువారం మొద‌లైంద‌ని, భ‌ర్తీ చేసుకుంనేందుకు త‌క్కువ స‌మ‌యం ఉంద‌ని ప్ర‌క‌టన. ఇందుకు గాను విద్యార్థులంతా ఇచ్చిన గుడువు లోగా త‌మ సీట్లను భ‌ర్తీ చేసుకోవాలని తెలిపారు.
AP EAPCET final phase of counselling

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌) ఎంపీసీ స్ట్రీమ్‌ తుది కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో 4,643 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా ఆయా కాలేజీల్లో 1,200 సీట్లు భర్తీ కావాల్సి ఉంది.

Free Coaching for Youth: ఉచిత యోగా యానిమేష‌న్ శిక్ష‌ణ‌

షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే గడువు ముగియనుంది. శనివారం వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేస్తారు. ఈనెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన వెబ్‌ ఆప్షన్స్‌కు సైతం అదే రోజుకు గడువు ముగియనుంది. ఈ నెల 21న సీట్ల కేటాయింపు చేసి, 22 నుంచి 25 లోపు సీటు పొందిన కాలేజీల్లోకి వెళ్లి రిపోర్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
 

#Tags