Skip to main content

Engineering Seats: అన్‌ రిజర్వుడ్‌ సీట్లు 10 వేలు.. ఈ ఇంజనీరింగ్‌ సీట్లలో ఈ విద్యార్థులకూ చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో దాదాపు 10,500 కన్వీర్‌ కోటా సీట్లు అన్‌ రిజర్వుడ్‌గా ఉండే అవకాశం ఉంది.
Engineering Seats

ఈ సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులూ పోటీ పడతారు. ఈ అవకాశం కేవలం ఈ విద్యా సంవత్సరం (2024–25)కు మాత్రమే ఉంటుంది. కాగా మిగిలిన 85 శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 నుంచి పదేళ్ళపాటు ఏపీ విద్యార్థులకు కూ డా తెలంగాణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉంది. ఈ లెక్క 2024 జూన్‌తో ఈ గడువు పూర్త య్యింది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు సీట్లు ఇవ్వాలా?వద్దా? అనే సంశయం ఏర్పడింది. దీని పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో తాజా కౌన్సెలింగ్‌లో అన్‌ రిజర్వుడ్‌ సీట్లను కేటాయించారు. 

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

ఎంత మందికి ఎన్ని సీట్లు? 

ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 98,296 సీట్లున్నాయి. వీటిల్లో 70,307 సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ఇందులో 15 శాతం అన్‌ రిజర్వుడ్‌ సీట్లుగా పరిగణిస్తారు. అంటే దాదాపు 10,500 సీట్లు ఉంటాయి. ఈఏపీసెట్‌లో ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ, మహాత్మాగాంధీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ యూనివర్సిటీలకు తెలంగాణ స్థానికత ఉంటుంది. ఏపీలోని ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర వంటి వర్సిటీలను స్థానికేతర వర్సిటీలుగా పరిగణిస్తారు.

ఈ విశ్వవిద్యాలయాల పరిధిలోకి వచ్చే విద్యార్థులు కూడా టీజీఈఏపీ సెట్‌ రాసేందుకు మొన్నటివరకు అవకాశం ఉంది. ఈ ఏడాది 49,063 మంది ఏపీ విద్యార్థులు సెట్‌కు దరఖాస్తు చేశారు. వీరిలో 44,889 మంది పరీక్ష రాశారు. 34,621 మంది అర్హత సాధించారు. వీళ్ళంతా అన్‌ రిజర్వుడ్‌ కోటా కిందకు వస్తారు. వీరు 15 శాతం సీట్లకు తెలంగాణ విద్యార్థులతో పోటీ పడాల్సి ఉంటుంది. ప్రతి ఏటా సుమారు 4 వేల మంది ఏపీ విద్యార్థులు ఈ విభాగంలో సీట్లు పొందుతున్నారు.  

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

మొదటి కౌన్సెలింగ్‌లోనే మరికొన్ని సీట్లు! 

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. జూలై 8న‌ నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇస్తున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరం మరికొన్ని సీట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. కొన్ని కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకునేందుకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. అక్కడ్నుంచి అనుమతి కూడా లభించింది. దీంతో ఈ సీట్లను కౌన్సెలింగ్‌ నుంచి మినహాయించారు. ఇలాంటి సీట్లు 10 వేల వరకూ ఉంటాయని చెబుతున్నారు.

వీటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్‌ గ్రూప్‌తో పాటు, సీఎస్‌ఈ అనుబంధ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని కాలేజీలు కోరాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని కాలేజీలు అదనపు సెక్షన్లు, సీట్లు కోరుతున్నాయి. ఇవి 10 వేల వరకూ సీట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. దీనిపై జూలై 8న‌ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు.

ఒకటి రెండురోజుల్లో కొత్త సీట్లకు అనుమతి లభించే వీలుంది. దీంతో కంప్యూటర్‌ బ్రాంచీల్లో మరో 20 వేల సీట్లు చేరే వీలుంది. ఇందులో కూడా అన్‌ రిజర్వుడ్‌ సీట్లు ఉంటాయి. మొదటి కౌన్సెలింగ్‌కు ఆప్షన్లు ఇచ్చే గడువు ఈ నెల 15తో ముగుస్తుంది. కాబట్టి ఆలోగానే సీట్లపై స్పష్టత ఇవ్వనున్నట్టు సాంకేతిక విద్యా విభాగం తెలిపింది. 

Published date : 10 Jul 2024 10:29AM

Photo Stories