JNTUH: ఆన్‌లైన్ సర్టిఫికెట్‌ కోర్సులకు జేఎన్‌టీయూ నోటిఫికేష‌న్‌.. కోర్సు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

ఆన్‌లైన్‌లో కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా.. అయితే హైద‌రాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఆన్‌లైన్ ద్వారా కొన్ని కోర్సులను అందిస్తోంది.

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ 6 నెలల వ్యవధి కలిగిన మూడు ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఇటీవ‌ల విడుదల చేసింది. దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. డిప్లొమా/యూజీ/పీజీ చేస్తున్న వారు లేదా ఇప్పటికే పూర్తి చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సీటుని కేటాయిస్తారు. ఈ కోర్సులను ఆన్‌లైన్‌లో ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందిస్తారు. 

కోర్సుల వివ‌రాలు..
1.సైబర్‌ సెక్యూరిటీకు సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌, ఈ-కామర్స్‌ అండ్‌ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్‌ లాస్‌ అండ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులు ఉంటాయి.

2.డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌కు ప్రోగ్రామింగ్ యూజింగ్‌ పైథాన్‌, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్టులు నేర్పిస్తారు.

3.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్‌కు పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెస్‌, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులు ఉంటాయి.
 
ఫీజు వివరాలు..
▶ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 
▶ అడ్మిషన్‌ ఫీజు రూ.1,000
▶ కోర్సు ఫీజు రూ.25,000.

ముఖ్య తేదీలు..
▶ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌డానికి చివరి తేదీ డిసెంబర్‌ 15, 2023 (సాయంత్రం 4 గంటల లోపు)
▶ అపరాధ రుసుము(రూ.500)తో ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్‌ 22, 2023 (సాయంత్రం 4 గంటల లోపు)

#Tags