Employment: ఐటీఐతో ఉపాధి అవకాశాలు
మంచిర్యాలఅర్బన్: ఐటీఐతో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంచిర్యాల ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ అన్నారు.
అక్టోబర్ 29న ఐ టీఐలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్, ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంవో శ్రీధర్ ఈ ఏడాదిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తొమ్మిది ట్రేడ్స్‌లో 90శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఉద్యోగులను అభినందించారు.
చదవండి: NAAC A Grade : ఈ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్..
విద్యార్థినులు ఎలక్ట్రీషియన్, కోపా, ఫ్యాషన్‌డిజైన్, సోలార్ టెక్నీషియన్ చేయడం వల్ల భవి ష్యత్ ఉంటుందని తెలిపారు. ఐటీఐ డీటీవో లు హఫీజ్, వెంకటేశ్వర్లు, ఏటీవోలు సొహిబ్, రాజేందర్, శశికుమార్, జూనియర్ అసిస్టెంట్ సాక్షి దహీయ, లావణ్య సుశిల్ పాల్గొన్నారు.
#Tags