Btech Results: బీటెక్ ఫలితాలు విడుదల.. రెగ్యులర్‌తో పాటు సప్లిమెంటరీ రిజల్ట్స్

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో జూలై నెలలో నిర్వహించిన బీటెక్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ, ఒకటో సెమిస్టర్ (ఆర్–20) సప్లిమెంటరీ, నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20) సప్లిమెంటరీ, ఎంటెక్, ఎంఫార్మసీ మూడో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–17) సప్లిమెంటరీ, రెండో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–17) సప్లిమెంటరీ ఫలితాలు, ఒకటో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–17) సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు తెలిపారు.
Constable Jobs: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఉచితంగా శిక్షణ
కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలు జేఎన్‌టీయూఏ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.