ITI Admissions: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

నిర్మల్‌ చైన్‌ గేట్‌: ఐటీఐ కాలేజీల్లో 2024 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడినట్లు నిర్మల్‌ ఐటీఐ ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి ఉన్న విద్యార్ధులు ititelangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్‌ పూర్తి చేయాలన్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ ఐటీఐ కళాశాలలో 2024 విద్యా సంవత్సరంలో ఎలక్ట్రీషియన్‌ 80, ఫిట్టర్‌ 20, రిఫ్రిజిరేష్‌, ఏసీ కోర్సులో 24, వెల్డర్‌ 40, డీజిల్‌ మెకానిక్‌ 18, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ 48, డ్రెస్‌ మేకింగ్‌లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

చదవండి: Government Schools and Colleges: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లవైపు మొగ్గు చూపుతున్న‌ విద్యార్థులు..!

త్వరలో సోలార్‌ టెక్నీషియన్‌, డ్రోన్‌ టెక్నీషియన్‌ కోర్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పదో తరగతి మెమో, బోనఫైడ్‌ (4 నుంచి 10 వరకు) ఆధార్‌ జిరాక్స్‌, కుల ధ్రువీకరణ పత్రము, కలర్‌ ఫొటో, ఈ మెయిల్‌ ఐడీ, సర్టిఫికెట్స్‌ అప్లోడ్‌ చేసి ఆప్షన్స్‌ ఎంచుకోవాలన్నారు. జూన్‌ 10వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీ ఉందని పేర్కొన్నారు.
 

#Tags