B.Ed Posts: బీఈడీ అభ్య‌ర్థుల‌కు నిరాశ‌

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్లుగా ఎన్నో ఖాళీ పోస్టులు ఉన్నాయి అని అభ్య‌ర్థులు ఆశించ‌డంతో, వారంతా వేల‌ల్లో ప‌రీక్షకు హాజ‌రు అయ్యారు. కానీ, పోస్టుల వివ‌రాలు తెలుసుకున్న త‌రువాత వారంద‌రికీ నిరాశే ఎదురైంది. ఉపాధ్యాయ‌ల పోస్టుల వివ‌రాలు, వారి నిరాశకు కార‌ణం తెలుసుకుందాం...
B.ed students are disappointed

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలతో జిల్లాలో అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. కొలువుల కోసం వేలల్లో అభ్యర్థులు ఏళ్లుగా ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలు పదుల సంఖ్యలో ఉండడంతో నిరాశ నెలకొంది. మొత్తం 115 ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించగా, ఇటీవల టెట్‌కు హాజరైన అభ్యర్థులు 12 వేలకుపైగా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో కొన్ని పోస్టులు ఒక్క ఖాళీ లేకపోగా, మరికొన్ని ఒకటి, రెండు పోస్టులే ఉన్నాయి. దీంతో బీఈడీ అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం పాత కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిసింది.

Government Teacher Jobs 2023 : ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్‌ డిగ్రీ అభ్యర్థులు కూడా అర్హులే..

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఎస్‌ఏ తెలుగు 4, హిందీ 4, గణితం (ఉర్దూ మీడియం) 1, సోషల్‌ స్టడీస్‌(ఉర్దూ మీడియం) 1, బయోసైన్స్‌ తెలుగు మీడియం 5, ఎస్‌ఏ ఉర్దూ 1 మొత్తం సబ్జెక్టులవారీగా ఎస్‌ఏ పోస్టులు కేవలం 16 ఉన్నాయి. ఎస్‌జీటీ తెలుగు మీడియం 50, ఉర్దూ మీడియం 37 ఉన్నాయి. భాషాపండిట్‌ హిందీ 1, మరాఠీ 2, ఉర్దూ 1, పీఈటీ పోస్టులు 4 ఉన్నాయి.

Teachers Examinations: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల‌కు ప‌రీక్ష‌లు

రోస్టర్‌ వారీగా ఇలా...

ఇక, మొత్తం 115 పోస్టులకు సంబంధించి రోస్టర్‌ను ప్రకటించారు. ఓసీ విభాగంలో జనరల్‌ 21, మహిళ 24, ఎస్సీ విభాగంలో జనరల్‌ 10, మహిళ 13, ఎస్టీ విభాగంలో జనరల్‌ 5, మహిళ 5, దివ్యాంగుల విభాగంలో జనరల్‌ 1, మహిళ 4, ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో జనరల్‌ 5, మహిళ 2, మాజీ సైనిక విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. బీసీ ఏ విభాగంలో జనరల్‌ 3, మహిళ 7, బీసీ బీ విభాగంలో జనరల్‌ 3, మహిళ 3, బీసీ సీ విభాగంలో జనరల్‌ 2, బీసీ డీ విభాగంలో మహిళ 2, బీసీ ఈ విభాగంలో మహిళ 2 పోస్టులు ఖాళీలు ప్రకటించింది.


ఇంగ్లిష్‌, గణితం, ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులేవి..?

జిల్లాలో కొన్ని సబ్జెక్టులకు ఒక్క ఖాళీ లేకపోవడం గమనార్హం. ఎస్‌ఏ విభాగంలో తెలుగు మీడియంలో ఇంగ్లిష్‌, గణితం, ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులు లేవు. దీంతో ఆయా సబ్జెక్టు అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#Tags