TSCHE Chairman Interview on EAMCET Counselling: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై టీఎస్సీహెచ్ఈ చైర్మ‌న్ సూచ‌న‌లు..

ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ, మార్గదర్శకత్వంపై సాక్షి ఎడ్యుకేషన్ తో టీఎస్సీహెచ్ఈ చైర్మ‌న్ డా. బి. లింబాద్రి ప్రత్యేక ఇంటర్వ్యూ.. వారి మాటల్లో..

ఇంట‌ర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల‌తోపాటు స‌ప్లిమెంట‌రీ రాస్తున్న విద్యార్థులు కూడా ఈ ప‌రీక్ష‌కు హాజ‌రైయ్యారు. 3,55,000 విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు హాజ‌రైయ్యారు. అందులో 90,000 వ‌ర‌కు అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీకి సంబంధించి ప‌రీక్ష రాసారు. మిగిలిన‌, 2,65,000 విద్యార్థులు ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు హాజ‌రైయ్యారు. 

NEET UG 2024: త్వరలోనే నీట్‌ యూజీ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
 
తెలంగాణ రాష్ట్రం అంద‌రికంటే ముందుగా ఎంసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించి, అందుకు సంబంధించిన ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేశారు. అడ్మిష‌న్ షెడ్యూల్‌కు సంబంధించి క‌స‌ర‌త్తు కూడా ఈరోజే తెలంగాణ ఎడ్యుకేష‌న్ ముఖ్య కార్య‌దర్శి బుర్రా వెంక‌టేశం సహ‌చ‌రుల‌తో ఉన్న‌ క‌మిటీ రూప‌క‌ల్ప‌న చేశారు.

DOST Admissions 2024

డిగ్రీ అడ్మిష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. దోస్త్‌, డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీస్ తెలంగాణ‌. ఇందులో రాష్ట్రంలో ఉన్న డిగ్రీ క‌ళాశాల‌ల్లో సీట్లు పొందేందుకు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే, చాలామంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్‌లు చేసుకొని, వెబ్ ఆప్ష‌న్స్ పెట్టుకుంటున్నారు. ఇది మూడు విభాగాల్లో జ‌రుగుతుంది. వీటిని జూన్ 30వ తేదీలోగా పూర్తి చేసుకోవాల‌ని ఇప్ప‌టికే ఒక అక‌డ‌మిక్ క్యాలండర్‌ను విడుద‌ల చేశామ‌న్నారు రాష్ట్ర విద్యా మండ‌లి చైర్మ‌న్ లింబాద్రి. అయితే, 70,000 మంది విద్యార్థులు ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ చేసుకొని వెబ్ ఆప్ష‌న్స్‌ను పెట్టుకుంటున్నారు. అతిత్వ‌ర‌లో మిగులు సీట్ల భ‌ర్తీ కూడా జ‌రుగుతుంద‌న్నారు. 

డిగ్రీలో బీఏ, బీకాం, వంటి గ్రూపుల్లో విద్యార్థుల‌కు మంచి నైపుణ్యాలు, భ‌విష్య‌త్తులో ఉపాధి అవకాశాలు వ‌చ్చేలా రూపోందించారు. బీబీఏ రిటైల్మెంట్ వంటి కోర్సుల‌ను పెట్టి వారికి వారంలో మూడు రోజులు క్లాస్‌లో, మ‌రో మూడురోజులు ప్రాక్టిక‌ల్ నాలెడ్జి కోసం బ‌య‌ట‌కు తీసుకెళ‌డం ఉంటుంది. దీనితో విద్యార్థుల‌కు స్టైఫండ్ కూడా అందే చ‌ర్యలు తీసుకున్నారు.

TG EAPCET 2024 Counselling Schedule

గతంలో TS EAPCET... ఇప్పుడు TG EAPCET 2024గా మార్చి అడ్మిష‌న్ షెడ్యూల్‌ను రూపోందించారు. 27 జూన్ 2024 నుంచి అడ్మిష‌న్‌లు పొందేందుకు వీలుంటుంది. ప్రొవిజ‌న‌ల్ అలాట్మెంట్‌ మొద‌టి ఫేజ్ 12 జులై 2024 రిలీజ్ చేస్తారు. రెండో ఫేజ్‌ 19 జులై 2024 రిలీజ్ చేస్తారు. రెండో ఫేజ్ ఎలాట్‌మెంట్ 5 ఆగ‌స్ట్ వ‌ర‌కు జ‌రుగుతాయి. స్పాట్ అడ్మిష‌న్లు 17 ఆగ‌స్టు 2024న ముగియ‌నుంది. ఇలా, మూడు విడుత‌ల్లో ఇంజినీరింగ్‌కు అడ్మిష‌న్‌లు జ‌రుగుతాయి. విద్యార్థులు అడ్మిష‌న్‌లు, కౌన్సెలింగ్‌కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా, మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవాల‌న్న‌ వెబ్‌సైట్ లేదా రాష్ట్రంలో ఉన్న 37 హెల్ప్‌డెస్క్‌ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Engineering and Ecet Counselling Schedule: ఇంజనీరింగ్‌, ఈ–సెట్‌.. కౌన్సెలింగ్‌ తేదీలు ఇలా..

ఇంజినీరింగ్‌లో చేరేందుకు ఎంసెట్ వంటి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను రాసిన విద్యార్థులు జ‌ర‌గ‌నున్న కౌన్సెలింగ్ కోసం ప‌లు స‌ర్టిఫికెట్ల‌ను సేక‌రించుకొవ‌ల‌సి ఉంటుంది. కౌన్సెలింగ్ స‌మ‌యంలో విద్యార్థులు సేక‌రించుకునే ఈ రెల‌వెంట్ స‌ర్టిఫికెట్లు..

  •  6-12 వ‌ర‌కు బొనోఫైడ్ స‌ర్టిఫికెట్ల‌ 
  •  టెన్త్‌, ఇంట‌ర్ మెమోలు
  •  సామాజిక నేప‌థ్యం (కుల దృవీక‌ర‌ణ ప‌త్రం)
  •  ఈడబ్యూఎస్‌
  •  రిజిస్ట్రేష‌న్ ఫీజ్‌-- 300 రిజ‌ర్వ‌డ్, అన్ రిజ‌ర్వ‌డ్ వారికి 6000

కౌన్సెలింగ్ ప్ర‌క్రియ

ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే కౌన్సెలింగ్ ప్ర‌క్రియలో ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు. రెండు మూడు సంవ‌త్సార‌లుగా ఏ ర్యాంకులో, ఏ కేట‌గిరి విద్యార్థికి, ఏ కాలేజీలో ఎక్క‌డ వర‌కు క‌ట్టాఫ్ మార్కులు వంటి విష‌యాల‌ను అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల‌కు ఎటువంటి సందేహాలున్న కౌన్సెలింగ్ సెంట‌ర్స్‌ను సంప్ర‌దించే అవ‌కాశం ఉంటుంది. ఫోన్లతో కూడా విద్యార్థులు ప్ర‌క‌టించిన వెబ్‌సైట్‌తో కూడా త‌మ సందేహాల‌ను తీర్చుకోవ‌చ్చు.

TS EAPCET Cutoff Ranks 1st phase | 2nd | Final | Spl phase

క‌ళాశాల‌ను ఎంపిక చేసుకునే విధం..
రాష్ట్రంలో 178 ఇంజినీరింగ్ క‌ళాశాలలు ఉన్నాయి. 1,18,000 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందుల‌ను ప‌డ‌కూడ‌దు. ప్ర‌తీ క‌ళాశాల‌లో కోర్సుల‌ను ప‌రిశీలించాలి. ఎన్ని క‌ళాశాల‌ల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి. కోర్సు ప్ర‌కారం క‌ళాశాల‌ల‌ను చూసుకోవాలి. ప్ర‌తీ విద్యార్థులు కెరీర్‌కు ఆధారంగా కోర్సును, క‌ళాశాల‌ను ఎంచుకోవాలి.
గ‌తంలో విద్యార్థులు కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులోకే ఎక్కువ‌గా ఎంచుకునే వారు. విద్యార్థులు, భ‌విష్య‌త్తులో ఎటువంటి కోర్సులు అభివృద్ధి చేందేందుకు, ఉపాధి అవ‌కాశాలు ఏ రంగంలో పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి అనే విష‌యాల‌ను ప‌రిశీలించి ఎంచుకోవాలి. చాలామంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కోర్సుల‌కే వెళ్తున్నారు గాని, వాటితోపాటు కోర్ ఇంజ‌నీరింగ్‌, అంటే.. సివిల్‌, మెకానిక‌ల్‌, ఎలెక్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో వెళ్లే విద్యార్థుల సంఖ్య త‌గ్గుతుంది. భ‌విష్యత్తులో ఈ రంగాల్లో కూడా అవ‌కాశాలు ఉంటాయి. 

Engineering: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అక్రమ డొనేషన్లను అరికట్టాలి

ఏ దేశమైన ఏ రాష్ట్ర‌మైన అభివృద్ధి చెందాలంటే దేశంలో ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అవ‌స‌రం అవుతుంది. అందుకు, ఈ ఇంజినీరింగ్ కోర్సుల‌తో సాధ్యం అవుతుంది. అమెరిక‌న్ వారు మెకానిక‌ల్‌, సివిల్ వారికి భవిష్య‌త్తులో 7 శాతం అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంద‌ని స్ట‌డీ చేశారు. ఈ విష‌యం గురించి విద్యార్థులు కూడా ఆలోచించి, ముందడుగు వేయాల‌ని తెలిపారు ఆయ‌న‌. ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల్లో చాలామంది అనేక రంగాల్లో స్థిర‌ప‌డ్డారు. వారికి ఉన్న ప్ర‌తిభ‌, విద్యతో ప‌లు రంగాల్లో ఎదుగుతున్నారు.  

Staff Nurse Salaries Problems : స్టాఫ్‌ నర్స్ క‌ష్టాలు.. కొలువు ఇచ్చారు.. మ‌రి జీతాలు ఎవ‌రు ఇస్తారు..?

ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేళ్ళ కంప్యూట‌ర్ సైన్స్‌, హాన‌ర్స్ కోర్సుల‌ను కూడా రోపోందించారు. దీనితో, సాంకేతిక ప‌రంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా పై చ‌దువులు చ‌దివే అవ‌కాశం ఉంటుంది. ఈ ఏడాది కూడా డిగ్రీ విద్యార్థుల‌కు బీఏ స్పెష‌ల్‌, బీకాం ఫైనాన్స్‌, వివిధ యూనివ‌ర్సిటీలోని ప్రొఫెస‌ర్స్‌లు ఈ కోర్సుల‌ను అభివృద్ది చేశారు. 

డిగ్రీలో బ‌కెట్ సిస్ట‌మ్‌..
ఇంట‌ర్ డిసిప్లేన‌రీ, మల్టీ డిసిప్లేన‌రీ కోర్సుల్లో దోస్త్‌లో బ‌కెట్ సిస్ట‌మ్‌లో బీఎస్సీలో జ‌ర్న‌లిజం, ఎక‌న‌మిక్స్‌, సైకాల‌జీ చ‌దివే అవకాశం ఉంటుంది. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, సైకాల‌జీ లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, జ‌ర్నలిజం చ‌దువుకోవ‌చ్చు. విద్యార్థులు వారికున్న‌, ఆస‌క్తి, సృజ‌నాత్మ‌క అవ‌గాహ‌న‌ను బ‌ట్టి కోర్సుల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంటుంది. 

ఇంజ‌నీరింగ్‌లో మేజ‌ర్‌, మైన‌ర్ కోర్సులు
డిగ్రీలో పెట్టిన విధంగా ఇంజ‌నీరింగ్‌లో బ‌కిట్ సిస్టమ్ కాకుండా మేజ‌ర్‌, మైన‌ర్ అనే కోర్సులు... ఉదాహ‌ర‌ణ‌కు.. బీఈ మెకానిక‌ల్ విద్యార్థి మైన‌ర్ కంప్యూట‌ర్ చ‌ద‌వ‌చ్చు. 

Certificate Programme: ఎంటెక్‌, పీహెచ్‌డీ ఫుల్‌టైం సర్టిఫికేట్‌ ప్రోగ్రాం కోసం దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

ఫీజులో మార్పులు..!
తెలంగాణ ప్ర‌భుత్వం నియ‌మించిన‌ టీఎఫ్ఆర్‌సీ వారు రూపోందించిన ఫీజును ప్ర‌భుత్వం ఆమోదించి ఇచ్చే జీవోను మూడు సంవ‌త్స‌రాలు కొన‌సాగుతుంది. 

క‌ళాశాల ఎంపిక విధానం..
విద్యార్థులు చేరాల‌నుకున్న క‌ళాశాల గురించి నిర్ధిష్ట‌మైన విష‌యాలను సేక‌రించి క్ర‌మంలో రాసుకొని దాని ప్ర‌కారం వెబ్ ఆప్ష‌న్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

Telangana Academic Calendar 2024 : తెలంగాణ అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?

కేట‌గిరి బి అడ్మిష‌న్స్‌

70 శాతం సీట్లు కన్వీన‌ర్ కోట కింద 30 శాతం మేనేజ్మెంటు కింద కౌన్సిలింగ్ నిర్వ‌హించాల‌న్న‌ది కోర్టు జెడ్జిమెంట్. కొన్ని కాలేజీలు షెడ్యూల్ విడుద‌లకు ముందే అడ్మిష‌న్లు తీసుకుంటున్నాయి... అలాగే అధిక ఫీజులు తీసుకుంటున్నారు...  ఈ విష‌యం ప్ర‌భుత్వం దృష్టికి వ‌స్తే చ‌ర్యులు ఉంటాయి.

జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ త‌రువాత తీసుకునే నిర్ణ‌యం చాలా కీల‌క‌మైన‌ది. విద్యార్థుల ల‌క్ష్యం నెర‌వేరేందుకు ఇది ప్ర‌ధాన మైలు రాయిగా ఉంటుంది. విద్యార్థుల‌కు త‌మ త‌ల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని క‌ల్పిస్తే వారంతా మ‌రింత‌ ముందుకు వెళ్తారు.

US Visa Fees: అమెరికా వీసా ఫీజులు పెంపు.. వీసా దరఖాస్తు ఫీజులు ఇలా

#Tags