Skip to main content

US Visa Fees: అమెరికా వీసా ఫీజులు పెంపు.. వీసా దరఖాస్తు ఫీజులు ఇలా

అమెరికా హెచ్‌-1బీ వీసా అప్లికేషన్‌ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్‌ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
Tech Companies Sending Skilled Workers to America Face Higher Fees  Specialized Departments in US Faced with Increased Visa Fees   Increase in US visa fees  Immigration Experts Worry Over H-1B Visa Fee Hike

భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్‌-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్‌ ఫీజులను పెంచింది అమెరికా.

చదవండి: Student Visa Rules: ఇక్క‌డ చదువుకోవాలనుకునే విద్యార్థుల వీసాకు కొత్త రూల్ ఇదే..

రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్‌-1 వీసా దరఖాస్తు ఫీజు  

తాజా నిర్ణయంతో హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు),  రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్‌-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.

ఈబీ-5 వీసాల అప్లికేషన్‌ ఫీజులను రూ.3లక్షల నుంచి  (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు (11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ తమ ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

చదవండి: Hours Limit For International Students: అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలపై కెనడా కొత్త నిబంధనలు

వీసా దారుడిపై అదనపు భారం

ఫలితంగా నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ ప్రకారం.. హెచ్‌-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది.   

వీసా ఫీజులపై కోర్టులో వాదనలు

దీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు.. భారత్‌ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్‌, అప్లికేషన్‌ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్‌ ఒకరు.  

ఇది అమెరికాకే నష్టం

ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్‌ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివేంద్ర సింగ్‌ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. 

భిన్నాభిప్రాయలు వ్యక్తం 

ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్‌-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. 

Published date : 25 May 2024 05:42PM

Photo Stories