NEET UG 2024: త్వరలోనే నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ (NEET UG 2024) ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో విడుదల చేయనుంది. దీంతో పాటు ప్రశ్నపత్రం, అభ్యర్థల OMR ఆన్సర్ షీట్‌లను కూడా NTA అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలతో నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మే5న దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో NEET UG పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
పెన్ అండ్ పేపర్ మోడ్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరిగింది.దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహిస్తారు. తుది ఫలితాలను వచ్చే నెల 14వ తేదిన విడుదల చేయనున్నట్లు సమాచారం. నీట్ యూజీ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. exams.nta.ac.in/NEETలోకి వెళ్లి నీట్ యూజీ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ చెక్చేసుకోవచ్చు.