TS EAMCET Seats Allotment 2023 : ఎంసెట్ తొలి విడ‌త సీట్ల కేటాయింపు తేదీ ఇదే.. ఈ సీట్లకే ఎక్కువ పోటీ.. ప్రధాన ఆప్షన్ ఈ బ్రాంచ్ వైపే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జూలై 16వ తేదీన తొలి విడత సీట్లు కేటాయించ‌నున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
TS EAMCET Seats Allotment 2023 Date and Time

వాస్తవానికి సీట్ల భర్తీ ప్రక్రియను జూలై 12వ తేదీనే చేపట్టాల్సి ఉంది. ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడవ్వడం, 14 వేలకుపైగా సీట్లను తొలి దశ కౌన్సెలింగ్‌లో చేర్చాల్సి రావడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మార్పులు చేశారు. జూలై 12తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగిసింది.

☛ Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

5.25 లక్షల ఆప్షన్లు..
మొత్తం 81,856 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వీరిలో 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్‌ ఫ్రీజింగ్‌ ముగిసే సమయానికి 5.25 లక్షల ఆప్షన్లు అందినట్టు అధికారులు తెలిపారు. అయితే తొలి దశలో ఎంసెట్‌ టాప్‌ ర్యాంకులు సాధించిన వాళ్ళు తక్కువగా ఆప్షన్లు ఇచ్చారు.

5 వేలకుపైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా..

ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌ క్యాంపస్‌ల్లో ఉండే సీట్లకే పోటీపడ్డారు. 5 వేలకుపైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులు టాప్‌ టెన్‌ ప్రైవేటు కాలేజీలకు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 155 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలు మరో 18 ఉన్నాయి. మొత్తం 173 కాలేజీల్లో 76,359 ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నట్టు టీఎస్‌ ఎంసెట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు.

Check College Predictor - 2023 AP EAPCET TS EAMCET

ప్రధాన ఆప్షన్ ఈ బ్రాంచ్ వైపే..: 

కౌన్సెలింగ్‌కు వచ్చిన 5.25 లక్షల ఆప్షన్లలో 4 లక్షలకుపైగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, దాని అనుబంధ కంప్యూటర్‌ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత స్థానంలో ఐటీ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 7 వేల వరకూ సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా సీట్లు మంజూరయ్యాయి. ఇవి కూడా కంప్యూటర్‌ బ్రాంచీల్లోనే ఉన్నాయి. కంప్యూటర్‌ సంబంధిత బ్రాంచీలన్నీ కలిపి మొత్తం 42,087 సీట్లు తొలి దశ కౌన్సెలింగ్‌లో చేరాయి. గత కొన్నేళ్ళుగా సీఎస్‌సీ బ్రాంచీల్లోనే 90 శాతానికిపైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో 50 శాతంలోపే నిండుతున్నాయి. 

☛ EAMCET Counselling 2023 : ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు మేము రాంరాం.. కారణం ఇదే..!

#Tags