Skip to main content

Engineering Admissions: కాలేజీల్లో పెరిగిన కటాఫ్‌.. ప్రధాన కాలేజీల్లో ఈ ఏడాది కటాఫ్‌ ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి...

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పెరగడం ఈసారి విద్యార్థులకు కలిసి వచ్చింది. అన్ని కాలేజీల్లోనూ కటాఫ్‌ పెరిగింది. చాలామంది కోరుకున్న కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దక్కించుకోగలిగారు.
Engineering Admissions
కాలేజీల్లో పెరిగిన కటాఫ్‌.. ప్రధాన కాలేజీల్లో ఈ ఏడాది కటాఫ్‌ ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి...

మొత్తం భర్తీ అయిన సీట్లలో 62.5% కంప్యూటర్‌ కోర్సులవే ఉన్నాయి. గత ఏడాది (2022) తొలి విడత కౌన్సెలింగ్‌లో జేఎన్‌టీ యూహెచ్‌ (సీఎస్‌ఈ)లో బాలికలకు 422 ర్యాంకు వరకే సీటు వచ్చింది. ఈసారి బాలురకు 813వ ర్యాంకు వరకూ, బాలికలకైతే 962 ర్యాంకు వరకూ ఓపెన్‌ కేటగిరీలో సీటు వచ్చింది. పేరున్న ప్రైవేటు కాలేజీల్లో గత సంవత్సరం గరిష్టంగా 3 వేల లోపు ర్యాంకు వరకే సీటు వస్తే, ఈసారి ర్యాంకు 4 వేలు దాటినా సీట్లు వచ్చాయి.

కొత్తగా కంప్యూటర్‌ కోర్సులు అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది అదనంగా 7,635 సీట్లు మంజూరయ్యాయి. కొన్నేళ్లుగా డిమాండ్‌ లేని సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో 6,930 సీట్లను కాలేజీలు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో విద్యార్థుల నుంచి డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ కోర్సు సీట్లు పెంచుకున్నాయి. ఫలితంగా ఈ ఏడాది మొత్తం 14,565 కంప్యూటర్‌ కోర్సు సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. కాగా ఇందులో 10 వేలకు పైగా కన్వీనర్‌ కోటాలో ఉన్నాయి. 

☛ College Predictor - 2023 - AP EAPCET TS EAMCET

రెండో దశలోనూ మంచి చాన్స్‌!

తొలిదశ కౌన్సెలింగ్‌ను పరిశీలించిన విద్యార్థులు రెండో దశపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ దశలో కూడా కటాఫ్‌ మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. ఈ ఏడాది 1,56,879 మంది ఎంసెట్‌ అర్హత సాధించారు. వీరిలో 76,821 మంది తొలి విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నా 75,708 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 70,665 మందికి సీట్ల కేటాయింపు జరిగింది. నిజానికి ఇందులో వెయ్యి లోపు ర్యాంకర్లు జేఈఈలోనూ ర్యాంకులు పొంది ఉండే వీలుంది.

జోసా ఆరవ రౌండ్‌ కౌన్సెలింగ్‌ త్వరలో చేపట్టే వీలుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంసెట్‌లో సీటు వచ్చిన వాళ్లు ఎన్‌ఐటీల్లో సీట్లు వస్తే వాటిల్లో చేరే వీలుంది. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలకు వెళ్తారు. మరికొంత మంది డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చేరతారు. మొత్తం మీద ఎంసెట్‌ తొలి రౌండ్‌లో సీట్లు వచ్చిన వారిలో 5 వేల మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో రౌండ్‌లో జాగ్రత్తగా ఆప్షన్లు ఇస్తే కోరుకున్న బ్రాంచీలో, కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

☛ Top 20 Engineering Colleges 2023 - Andhra Pradesh Telangana

జాగ్రత్తగా పరిశీలించి ఆప్షన్‌ ఇవ్వాలి
రెండో దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో జాగ్రత్త గా వ్యవహరించాలి. విద్యార్థి తనకు వచ్చిన ర్యాంకును దృష్టిలో పెట్టుకుని ఆప్షన్లలో ప్రాధా న్యత నిర్ణయించుకోవాలి. దీనికన్నా ముందు.. తాను కోరుకునే కాలేజీలో తొలిదశలో ఏయే ర్యాంకులకు సీట్లు వచ్చాయి? నిట్‌ వంటి జాతీ య కాలేజీలకు ఏయే ర్యాంకర్ల వరకూ వెళ్లే చాన్స్‌ ఉంది? అనే దానిపై కొంత కసరత్తు చే యాలి. గుడ్డిగా ఆప్షన్లు ఇవ్వకుండా, అన్నీ పరిశీలించి ఇస్తే కోరుకున్న బ్రాంచీ, కాలేజీ దక్కడం ఖాయం. 
– ఎంఎన్‌ రావు (గణిత శాస్త్ర అధ్యాపకుడు) 

తొలి దశ కౌన్సెలింగ్‌లో ప్రధాన కాలేజీల్లో ఈ ఏడాది కటాఫ్‌ ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి...

యాజమాన్యం

 

ఓపెన్‌

బీసీ–ఏ

బీసీ–బీ

బీసీ–సీ

బీసీ–డీ

బీసీ–ఈ

ఎస్సీ

ఎస్టీ

ఓయూ–సీఎస్‌ఈ

బాలురు

1391

3918

1804

5687

1912

2788

6101

7349

బాలికలు

1598

5524

2284

–––––––

2215

1900

7136

8414

సీఎస్‌ఈ (ఏఐ)

బాలురు

2848

6195

3798

19380

4842

4790

10923

11076

బాలికలు

2877

4328

3901

–––––––

4724

5987

13355

13947

ఈసీఈ

బాలురు

3623

8934

6822

–––––––

6248

–––––––      

14626

15567

బాలికలు

4436

10084

6855

–––––––

6337

5447

15561

18188

జేఎన్‌టీయూ

బాలురు

813

1579

1245

–––––––

1199

1886

4013

4534

సీఎస్‌ఈ

బాలికలు

962

2290

1028

–––––––

1579

–––––––

6753

6196

సీఎస్‌ఈ–ఏఐ

బాలురు

1359

3501

2131

–––––––

2399

4692

8932

8547

బాలికలు

1915

3975

2232

–––––––

2885

4478

9572

10293

సీబీఐటీ

బాలురు

1478

4509

2246

6314

2296

3014

861

11217

బాలికలు

1903

5314

2198

–––––––

2695

3867

11527

12687

వాసవీ సీఎస్‌ఈ

బాలురు

2405

7050

3008

12034

3837

6072

12291

15812

బాలికలు

2266

6968

3907

–––––––

3648

6916

14525

16040

వీఎన్‌ఆర్‌ విజ్ఞాన

బాలురు

1712

4952

2636

3099

2636

4773

11919

14598

జ్యోతి–సీఎస్‌ఈ

బాలికలు

1935

4309

2683

5242

2755

4924

11642

18027

కేఎంఐటీ–సీఎస్‌ఈ

బాలురు

5120

16102

7260

20337

7654

10730

32950

30728

బాలికలు

5682

21945

8948

28661

9125

15978

33023

55150

గోకరాజు–సీఎస్‌ఈ

బాలురు

4014

11077

7228

25132

6399

9195

22605

26200

బాలికలు

5015

14331

7789

23320

7589

11614

21286

27220

నారాయణమ్మ–సీఎస్‌ఈ

బాలికలు

4634

13033

7004

28674

7446

13239

25241

27323

Published date : 18 Jul 2023 03:55PM

Photo Stories