TS EAMCET 2024 Top Rankers: ఎంసెట్ ఫలితాల్లో టాప్-10లో ఒకే ఒక్క అమ్మాయి
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్థులై కైవసం చేసుకున్నారు.తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్ ఎప్‌సెట్(EAMCET-2024) ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
TS EAMCET Results Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే..
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్ (JNTUH)లో ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10లో ఒకే ఒక్క అమ్మాయి నిలవడం విశేషం.మొదటి పది ర్యాంకుల్లో 9ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకోగా, టాప్-10 ర్యాంకులో మాత్రం ధనుకొండ శ్రీనిధి నిలిచింది.
TS EAMCET 2024 Results Released: ఎంసెట్ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
TS EAMCET ఇంజనీరింగ్ టాపర్స్
1. సత్యవాడ జ్యోతిరాధిత్య (శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్)
2. గొల్ల లేఖ హర్ష (కర్నూల్, ఆంధ్రప్రదేశ్)
3. రిషి శేఖర్ శుక్లా (సికింద్రాబాద్, తెలంగాణ)
4. భోగాల్‌పల్లి సందేశ్ (మాదాపూర్, హైదరాబాద్)
5. మురసాని సాయి యశ్వంత్ రెడ్డి ( కర్నూల్, ఆంధ్రప్రదేశ్)
6. పుట్టి కుషాల్ కుమార్ (అనంతపురం, ఆంధ్రప్రదేశ్)
7. హుండేకర్ విదిత్ (రంగారెడ్డి, తెలంగాణ)
8. రోహన్ సాయి (హైదరాబాద్, తెలంగాణ)
9. మణితేజ (వరంగల్, తెలంగాణ)
10.ధనుకొండ శ్రీనిధి (విజయనగరం, ఆంధ్రప్రదేశ్)