EAMCET: కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి

కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి
  • మొదటి కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చింది? ఈ వివరాలన్నీ ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మీకు 12 వేల ర్యాంకు వచ్చి ఉండొచ్చు. మీరు దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆ కాలేజీలో సీఎస్‌ఈ సీటు 13 వేల ర్యాంకు వచ్చిన వారికి రావొచ్చు. ఆ ర్యాంకు వచ్చిన వ్యక్తికి అంతకన్నా మంచి కాలేజీలో సీటు వస్తుందా? లేదా అనేది పరిశీలించాలి. ఆ వ్యక్తికి సీటు రాకపోతే కాలేజీ మారే అవకాశం లేదని గుర్తించాలి.
  • మొదటి 5 వేల ర్యాంకుల వరకు చాలామేర మార్పుచేర్పులు ఉండొచ్చు. జాతీయ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారు ఈ ర్యాంకుల్లోనే ఉంటారు. కాబట్టి ఈ సీట్లు ఖాళీ అయితే మీకే వస్తాయని మొదటి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఎందు కంటే తర్వాత ర్యాంకులో వేరే బ్రాంచ్‌లో సీటు వచ్చిన వారు కూడా మీరు కోరుకునే బ్రాంచ్‌లోకి రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పడే వీలుంది.
  • మీకు వచ్చే ర్యాంకును బట్టి అటు ఇటుగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. మంచి కాలేజీగా భావిస్తే మొదటి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అదికూడా మీ ర్యాంకుకు దగ్గర్లో ఉంటేనే.. బ్రాంచ్‌ విషయంలోనూ ముందుగా ఫస్ట్‌ కౌన్సెలింగ్‌ జాబితాతో పాటు, గత రెండేళ్లు కాలేజీ ర్యాంకును పరిశీలించి ఆప్షన్ ఎంచుకోవాలి.

చదవండి:

#Tags