EAMCET 2023: రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద రెండో విడత సీట్ల కేటాయింపు జూలై 30న చేపట్టనున్నారు.
మొత్తం 173 కాలేజీల్లో 82,666 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో 70,665 సీట్లు ఎంసెట్ అర్హులకు కేటాయించగా...ఇంకా 12,001 సీట్లు మిగిలిపోయాయి. తొలివిడత సీట్లు కేటాయించిన వారిలో 18 వేలమంది ఇప్పటివరకూ రిపోర్ట్ చేయలేదు. ఈ సీట్లతోపాటుగా తొలి విడతలో మిగిలిన వాటిని కూడా కలుపుకుని మొత్తం 30 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. రెండోవిడతకు మొత్తం 53 వేలమంది విద్యార్థులు 23 లక్షల ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కే ప్రాధాన్యమిచ్చారు.
☛ College Predictor - 2023 - TS EAMCET | AP EAPCET | TS POLYCET | AP POLYCET
#Tags