Engineering: ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి? ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులేంటి?
ఇంజనీరింగ్ కాలేజీల్లో త్వరలోనే అడ్మీషన్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో ఏ బ్రాంచ్ ఎంచుకుంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రాంచ్‌లేవి? కెరీర్ పరంగా ఏ బ్రాంచ్‌కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది వంటి వివరాలపై JNTUH ప్లేస్‌మెంట్ ఆఫీసర్ విష్ణువర్థన్ అందించే కెరీర్ గైడెన్స్ మీకోసం..
►ఇంజనీరింగ్‌లో బ్రాంచ్ ఎంచుకునేటప్పుడు వాటికున్న డిమాండ్, ప్లేస్‌మెంట్స్ కూడా ముఖ్యం. ప్రస్తుతం ఏ బ్రాంచ్ నుంచి ఎక్కువగా ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి?
విష్ణువిర్ధన్: గత 5-10 ఏళ్లుగా CSE బ్రాంచ్‌కే ఎక్కువ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. అయితే కోర్ బ్రాంచ్‌లకు మంచి ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. దేని ప్రాధాన్యత దానిదే.
► JNTUHలో ప్లేస్‌మెంట్స్ ఎలా వస్తున్నాయి? ఏ బ్రాంచ్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకుంటున్నారు?
మా కాలేజీలో CSE బ్రాంచ్‌కి దాదాపు 90 శాతం ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. మొత్తం కాలేజీ పరంగా 60 శాతం ప్లేస్‌మెంట్స్ వస్తుంటాయి. గతేడాది దాదాపు 80 కంపెనీలు వచ్చాయి. యావరేజ్‌గా 5-6 లక్షల ప్యాకేజీతో స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు.
Engineering Study: ఇంజనీరింగ్‌లో ఎలాంటి బ్రాంచ్ సెలక్ట్ చేసుకుంటే కెరీర్ బావుంటుంది?
►సాధారణంగా విద్యార్థులకు ఏ ఏడాదిలో ప్లేస్‌మెంట్స్ ఛాన్స్ దక్కుతుంది?
దాదాపుగా నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్ నుంచి కంపెనీలు రావడం మొదలుపెడతాయి. సెలక్ట్ అయిన విద్యార్థులకు వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.
►సాఫ్ట్‌వేర్ సంబంధిత కంపెనీలు వస్తుంటాయా? లేద కోర్ కంపెనీలు కూడా వస్తుంటాయా?
రెండూ. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం కేవలం కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలకే డిమాండ్ అనుకోవడం అపోహ మాత్రమే. కోర్ కంపెనీలు కూడా భారీ జీతంతో రిక్రూట్ చేసుకుంటాయి.
►ఇంతకుముందు CSE కి సమానంగా ECE కి కూడా డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడంతా CSE వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం?
ECE కోర్ సబ్జెక్ట్స్ అయిన VLSI వంటి వాటిపై గ్రోత్ ఉంది కానీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అందుకే కంప్యూటర్ కోర్సుల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
► కోర్ బ్రాంచెస్ అయిన సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి?
వీళ్లకు దాదాపు 60 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ఇంతకుముందు మా స్టూడెంట్ మెటలర్జీ విద్యార్థికి 13 లక్షల అత్యధిక వేతనంతో ప్లేస్‌మెంట్‌లో కొలువు సంపాదించింది.
► ఇంజనీరింగ్ పూర్తవగానే చేతిలో ఉద్యోగం ఉండాలి అని భావించేవాళ్లు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మంచిది?
కమ్యూనికేషన్ స్కిల్స్‌లో చాలా మంచి పట్టుండాలి. టెక్నికల్ స్కిల్స్ బాగా తెలుసుండాలి. ఏ బ్రాంచ్‌కి చెందిన వాళ్లు అయినా కనీసం 1-2 కోర్ సబ్జెక్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉండాలి. ఫైనల్ ఇయర్‌లో చేసే ప్రాజెక్ట్స్ కూడా చాలా ముఖ్యం. ఇండస్ట్రీకి అవసరమైన ప్రాజెక్ట్స్ తీసుకోవాలి. ఇవి ఇంటర్వ్యూలో మీకు ఆగా హెల్ప్ అవుతాయి.