B.Pharmacy Counselling 2024: తెలంగాణ రాష్ట్రంలో బీఫార్మసీ తొలి విడతలో 8,453 సీట్లు భర్తీ

B.Pharmacy Counselling 2024: తెలంగాణ రాష్ట్రంలో బీఫార్మసీ తొలి విడతలో 8,453 సీట్లు భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో బీఫార్మసీ సీట్లకు జరిగిన తొలి విడత కౌన్సెలింగ్‌లో 8,845 సీట్లలో 8,453 సీట్లు  భర్తీ అయ్యాయి. ఫార్మా డీ కోర్సులో 1,648 సీట్లకు 1,627 సీట్లు, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులో 122 సీట్లకు 117 సీట్లు భర్తీ అయ్యాయి. బయో టెక్నాలజీ కోర్సులో 181 సీట్లు, బయోమెడికల్ కోర్సులో 58 సీట్లు భర్తీ అయ్యాయి.  అన్ని కోర్సుల్లో కలిపి 10,854 సీట్లకు గాను 10,436 భర్తీ కాగా కేవలం 418 ఖాళీగా ఉన్నాయి. . సీట్లు పొందిన వారు  ఈ నెల 30వ తేదీ  లోగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

ఇదీ చదవండి:  JEE Mains Session 1 2025 Notification out

#Tags