TS DSC Final Key and Result 2024 : డీఎస్సీ అభ్యర్థులకు అలర్డ్.. పరీక్ష ఫైనల్ 'కీ' .. ఫలితాలు విడుదల తేదీలు ఇవే..!
అలాగే ఇప్పుడు అధికారులు డీఎస్సీ ఫైనల్ కీ, ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు దాదాపు ఏర్పాట్లలను పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ చేపట్టి ఫైనల్ కీ రెడీ చేసింది.
నేడు లేదా రేపు ఫైనల్ కీ విడుదల..
టీఎస్ డీఎస్సీ-2024 ఫైనల్ కీ ని సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారని తెలిసింది. ఒక వేళ టెక్నికల్ సమస్యలు ఉంటే.. రేపు ఈ కీ ని విడుదల చేయనున్నారు. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన.. టీచర్స్ డే సందర్భంగా ఈ డీఎస్సీ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
☛➤ TS DSC 2024 Exam Answer Key Mistakes : తెలంగాణ డీఎస్సీ-2024 'కీ' లో ఇన్ని తప్పులా..? ఈ 18 ప్రశ్నలకు మార్కులను..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం..
రానున్న మూడు నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారట. రిజల్ట్స్ వదిలిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ వెంటనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు.
మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెల్సిందే.