TS DSC 2024 Application Date Extended : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడవు పొడిగింపు.. జిల్లాల వారిగా..
డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు దాదాపు 2.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ డీఎస్సీ-2024 పరీక్ష జూలై 17వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు జరగన్నాయి.
☛ Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్..
జిల్లాల వారిగా డీఎస్సీ పోస్టుల వివరాలు ఇవే..
11,062 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా…. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా.. ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే..137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.