Good News For TET Pass Candidates 2024 : టెట్ పాస్ అయిన వారికి గుడ్‌న్యూస్‌.. వీరికి డీఎస్సీలో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇటీవ‌లే టెట్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఈ టెట్ ఫ‌లితాల్లో పాస్ అయిన అభ్య‌ర్థుల‌కు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.

తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు.., తాజా టెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చ‌ని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ వెబ్‌సైట్‌లో  మార్పులు చేసింది. 

జూన్ 15 నుంచి 20వ తేదీ వరకు ఉచితంగానే..
అలాగే వీరు జూన్ 15వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకోవ‌చ్చును. టెట్‌కు దరఖాస్తు ఫీజు పెంచడం.. దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరిని తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్ టెట్ 2024లో అర్హత సాదించిన వారికి డీఎస్సీకి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది.  దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈసారి టెట్‌ పాస్‌కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే టెట్ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

11,062 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు జిల్లాల వారిగా ఇవే..
జులై 17 నుంచి 31 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. 11,062 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి తెలంగాణ విద్యా శాఖ‌ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా.. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా.. ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే.. 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags