AP DSC Notification Problems 2024 : అదిగో డీఎస్సీ-2024.. ఇదిగో.. డీఎస్సీ నోటిఫికేషన్...?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్‌పైన పెట్టిన విషయం తెల్సిందే. అయినా కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల పైన జాప్యం జరుగుతుంది. దీంతో డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థులు మాత్రం... అసలు నోటిఫికేషన్ వస్తుందో... రాదో అనే అనుమానంతో.. ప్రిపరేషన్ కూడా సరిగ్గా కొనసాగించలేకపోతున్నారు.
నవంబరు 6, 7 తేదీల్లో...
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. అతి త్వరలోనే.. మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తాం అంటుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మాత్రం 16,347 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు నవంబరు 6, 7 తేదీల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
➤☛ AP TET 2024 Key and Results 2024 : ఏపీ టెట్-2024 'కీ' విడుదల.. రిజల్డ్స్ తేదీ ఇదే...!
డీఎస్సీ సిలబస్ పై..
2024 డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే విధంగా డీఎస్సీ సిలబస్ పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది.
ఇంత వరకు..
ఒక డీఎస్సీ నోటిఫికేషన్‌నే కాదు.. ఇంత వరకు కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వంలో ప్రకటనలే కానీ.. ఉద్యోగ నియామకాలు, కొత్త నోటిఫికేషన్లు ముందుకు కదలడం లేదు.
16,347 ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాలు ఇవే ..:
పోస్ట్ | ఖాళీలు | |
1 | ఎస్‌జీటీ | 6,371 |
2 | పీఈటీ | 132 |
3 | స్కూల్ అసిస్టెంట్స్ | 7725 |
4 | టీజీటీ | 1781 |
5 | పీజీటీ | 286 |
6 | ప్రిన్సిపల్స్ | 52 |
ఏపీలోని జిల్లాల వారిగా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే..
జిల్లా | ఖాళీలు | |
1 | శ్రీకాకుళం | 543 |
2 | విజయనగరం | 583 |
3 | విశాఖపట్నం | 1134 |
4 | తూర్పు గోదావరి | 1346 |
5 | పశ్చిమ గోదావరి | 1067 |
6 | కృష్ణా | 1213 |
7 | గుంటూరు | 1159 |
8 | ప్రకాశం | 672 |
9 | నెల్లూరు | 673 |
10 | చిత్తూరు | 1478 |
11 | కడప | 709 |
12 | అనంతపురం | 811 |
13 | కర్నూలు | 2678 |