TG DSC 2024 Ranker Story : కూలీ పని చేసుకుంటూ.. చదివి.. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సాధించానిలా.. కానీ..
ఈ నేపథ్యంలో... దళిత సామాజిక వర్గానికి చెందిన తమది పేదరిక కుటుంబం. నా పేరు వావిలాల దుర్గాప్రసాద్. నేను కష్టపడి టీటీసీ చదువుకున్నాను. టీచర్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కూలీ పనులకు వెళ్తూ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్న. గతంలో డీఎస్సీ రాస్తే అర్హత సాధించలేదు. దీంతో వెనకడుగు వేయకుండా డబ్బుల కోసం తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో డీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. ఈసారి డీఎస్సీ రాస్తే 13వ ర్యాంకు వచ్చింది. నా కష్టానికి ఫలితం దక్కింది. అలాగే తన భార్య శివకుమారి కూడా ఓపెన్ కేటగిరీలో ఎస్జీటీగా ఎంపికైంది.
మా నాన్న చిన్నప్పుడే మరణించారు.. మా అమ్మ
నా పేరు దుర్గం సౌజన్య. నేను ఎంతో కష్టపడి పట్టుదలతో చదువుకున్న. మా నాన్న చిన్నప్పుడే మరణించారు. తల్లి అంకుల అన్ని రకాలుగా ఆదుకుంది. డీఎస్సీలో 22 ర్యాంకు రాగా ఎస్జీటీగా ఉద్యోగం వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే 70 మార్కులు సాధించి మంచి మెరిట్ సాధించా. ఇలా ఎందరో పేదింటి బిడ్డలు తమ పేదరికంను లెక్కచేయకుండా చదివి.. నేడు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు సాధించారు.