DSC 2024: డీఎస్సీలో 243 మంది ఉపాధ్యాయుల ఎంపిక
అక్టోబర్ 7న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్య, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య, టీఎస్‌ఆర్‌టీసీ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. డీఎస్సీలో జిల్లా నుంచి 243 మంది ఎంపికయ్యారని, వారందరికీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు 9న ఉదయం 8 గంటల వరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రిపోర్టు చేయాలన్నారు.
చదవండి: DSC Arts Teachers: డీఎస్సీ ఆర్ట్స్‌లలో ఖాళీగా పోస్టులు భర్తీ చేయాలి
నియామక పత్రాలు అందజేయనున్నందున అక్కడికి చేరుకునేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచి ఆరు బస్సులు బయల్దేరనున్నాయని పేర్కొన్నారు. ఎంపికై న ఉపాధ్యాయులందరికీ భోజనం, డిన్నర్, తాగునీరు, ఏర్పాట్లు చేయాలని, ప్రతి బస్సులో మండల విద్యాధికారి లైజన్ ఆఫీసర్‌గా, వైద్యారోగ్య శాఖ నుంచి ఏఎన్‌ఎం, పోలీస్, సీఆర్‌పీ, ఆర్‌ఐ, ఆఫీస్ సబార్డినేట్‌లు సహాయంగా వారి వెంబడి ఉంటారన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏఎస్పీ రాములు, డీఈఓ రవీందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మ, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
వేగవంతంగా ఎఫ్‌డీసీ డాటా ఎంట్రీ
ఫ్యామిలీ డిజిటల్ కార్డు (ఎఫ్‌డీసీ) జారీ కోసం నిర్వహించిన సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ ప్రక్రియ కలెక్టరేట్‌లో వేగవంతంగా కొనసాగుతుంది. డాటా ఎంట్రీ జరుగుతున్న తీరును కలెక్టర్ విజయేందిర బోయి అక్టోబర్ 7న పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను ఎంట్రీ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.