DSC 2024: ఖమ్మం లైబ్రరీలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైన 13 మందికి ఉద్యోగాలు

ఖమ్మం గాంధీ చౌక్‌: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సిద్ధమైన నిరుద్యోగుల్లో 13 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. డీఎస్సీ–2024లో 11 మంది ఉద్యోగాలను సాధించగా, ఇందులో తొమ్మిది మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఇద్దరు ఎస్‌జీటీలు ఉన్నారు.

స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు మమత, రాము, కోటి, నర్సింహారావు, సుధీర్‌, వెంకటేష్‌, సాంబయ్య, రాంబాబు, రాజు, ఎస్‌జీటీ ఉద్యోగాలకు గోపి, ఉపశ్రీ ఎంపికయ్యారు. అలాగే, గిరిధర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా, సుధీర్‌ మరో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం సాధించారు.

చదవండి: TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ..

ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల నిరుద్యోగులు ఖమ్మం గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఏటా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది 13మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని లైబ్రరీ కార్యదర్శి అర్జున్‌ తెలిపారు. ఈమేరకు అభ్యర్థులను కార్యదర్శితో పాటు గ్రంథాలయ ఉద్యోగులు అభినందించారు.

#Tags