DSC 2024 District Topper: ఎస్‌జీటీలో అరుణ్‌కుమార్‌ జిల్లా టాపర్‌

ములుగు రూరల్‌: డీఎస్సీ ఫలితాలలో ములుగు జిల్లా అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన మోటపోతుల అరుణ్‌కుమార్‌ జిల్లాలో ప్రథమ స్థానం సాధించాడు.

తెలుగు సెంకడరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల విభాగంలో 81.63శాతం మార్కులు సాధించి డీఎస్సీ జనరల్‌ ర్యాంకు లిస్టులో ప్రథమ స్థానంలో నిలిచారు. అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన మోటపోతుల రాణి –ఆనంద్‌గౌడ్‌ దంపతుల కుమారుడు అరుణ్‌కుమార్‌.

చదవండి: TG DSC 2024 Certificate Verification Required Documents : డీఎస్సీ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ప్రారంభం.. కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇవే...

కాగా, తండ్రి మృతి చెందిన 12వ రోజు డీఎస్సీకి హాజరైన అరుణ్‌కుమార్‌ మొక్కవోని దీక్షతో పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. దీనిపై గ్రామస్తులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అరుణ్‌కుమార్‌ను అభినందించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags