DSC 2023: ఈ జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 219

నల్లగొండ : ఉపాధ్యాయ నియమకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లాలో మొత్తం 219 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 219

 సెప్టెంబ‌ర్ 20వ తేదీ నుంచి అక్టోబర్‌ 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు జరగనున్నాయి.

చాలా కాలంగా బీఈడీ, టీటీసీ పూర్తి చేసి టెట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉపాధ్యాయ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కానీ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంపై నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు.

చదవండి: Teacher Recruitment Test: నిరుద్యోగులకు తీపి కబురు

2017లో టీఆర్టీ నిర్వహణ..

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయల ఖాళీలను భర్తీ చేసింది. అప్పటినుంచి ఐదేళ్లుగా ఉపాధ్యా నియామకాలు చేపట్టలేదు. ఇటీవల డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ చెప్పింది. ఆ ప్రకారమే పోస్టులను భర్తీ చేయనున్నారు.

దీనికి కలెక్టర్‌ కన్వీనర్‌గా వ్వవహరించనున్నారు. డీఎస్సీ రాసేందుకు అర్హత సాధించడం కోసం ఈ నెల 15న టెట్‌ నిర్వహించనున్నారు. డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులను వర్టికల్‌ రిజర్వేషన్‌ విధానం ద్వారా భర్తీ చేస్తారా లేదా హారిజంటల్‌ రిజర్వేషన్‌ పద్ధతిన నింపుతారా తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చదవండి: Teachers Family: ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు

నోటిఫికేషన్‌లో ఖాళీ పోస్టులు ఇలా

  • స్కూల్‌ అసిస్టెంట్లు: 86
  • భాషా పండితులు: 25
  • వ్యాయామ ఉపాధ్యాయులు: 6
  • సెకండరీ గ్రేడ్‌ టీచర్లు: 102
  • మొత్తం: 219

#Tags