Teachers Family: ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
Sakshi Education
సాక్షి, హన్మకొండ: ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే నలుగురు ఒకే వృత్తిని ఎంచుకోవడం సాధారణం.
ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
కానీ ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. బెంజిమన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు తరాలకు చెందిన 78మందికి సెప్టెంబర్ 6న హనుమకొండ కంచరకుంటలోని సెయింట్‌పాల్ హైస్కూల్ చైర్మన్ ఎం.ఆనంద్ ఆహ్వానం పంపగా 22మంది హాజరయ్యారు.
వీరిని గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించారు. బెంజిమన్ తండ్రి మోజెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1901లో బెంజిమన్ కుటుంబ సమేతంగా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.