Women's Asian Hockey Champions Trophy: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా భారత్‌

స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది.

 ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్‌ తేడాతో జపాన్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్‌రెమ్‌సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్‌ సాధించింది. 

Asian Para Games 2023: 111 పతకాలతో ఐదో స్థానంలో భార‌త్‌
 

#Tags