Abhay Singh: గుడ్‌ఫెలో క్లాసిక్ స్క్వాష్ టోర్నీ విజేత అభయ్
Sakshi Education
భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ తన కెరీర్‌లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఎ) సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు.
కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్‌ఫెలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విజేతగా నిలిచాడు.
40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్ 11–7, 11–9, 11–9తో మోరిస్ డేవ్‌రెడ్ (వేల్స్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్‌కిది రెండో టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ విల్లింగ్డన్ టోర్నీలోనూ అభయ్ టైటిల్ గెలిచాడు.
Badminton Asia Team Championships 2024: చరిత్ర సృష్టించిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు
Published date : 26 Feb 2024 04:51PM