Paris Paralympics: త్రో ఈవెంట్‌లో గోల్డ్‌మెడ‌ల్ గెలుచుకున్న తొలి భార‌త‌ అథ్లెట్ ఈయ‌నే..

ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ధరమ్‌బీర్ నైన్ స్వర్ణ పతకాన్ని, ప్రణవ్ సూర్మ రజత పతకాన్ని సాధించారు.

సెప్టెంబ‌ర్ 4వ తేదీ ఆర్ధ‌రాత్రి  జ‌రిగిన ఫైన‌ల్లో ధరమ్‌బీర్ నైన్ 34.92 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని సాధించి, పారాలింపిక్స్ చరిత్రలో క్లబ్ త్రో ఈవెంట్‌లో గోల్డ్‌మెడ‌ల్ గెలుచుకున్న తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు. ఆయన సాధించిన ఈ విజయం భారతీయ క్రీడలకు ఒక మైలురాయి.

ప్రణవ్ సూర్మ 34.59 మీటర్ల త్రోతో రజత పతకాన్ని సాధించడం ద్వారా భారత జట్టుకు మరో పతకాన్ని అందించారు. ఈ ఇద్దరు అథ్లెట్ల కృషి ఫలితంగా భారతదేశం ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే 24 పతకాలను సాధించింది. ఇందులో 5 స్వర్ణ, 9 కాంస్య మరియు 10 రజత పతకాలు ఉన్నాయి.

Deepthi Jeevanji: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్ ఈమెనే..

#Tags